అబుధాబీలో 21,000 మందికి పైగా రెడ్ సిగ్నల్ అతిక్రమణ
- November 02, 2015
రాజధానిలో ఇంచుమించు అన్ని కూడళ్ల వద్ద కూడా అత్యాధునిక కెమెరాలు అమర్చబడి ఉన్నాయని తెలిసి కూడా, 2015 సంవత్సరపు మొదటి తొమ్మిది నెలల్లో 21,851 మంది రెడ్ సిగ్నల్ ను అతిక్రమించినట్టు, అబుధాబీ ట్రాఫిక్ పోలీసు వారి ట్రాఫిక్ ఇంజనీరింగ్ మరియు రోడ్ సేఫ్టీ విభాగం డైరక్టర్ - లెఫ్టనెంట్ కల్నల్ బద్ర్ అహ్మద్ అల్ హార్తి ప్రకటించారు. ప్రమాదాలను నివారించడానికి కూడళ్లను సమీపించేటపుడు వేగాన్నీ తగ్గించవలసిందిగా మరల మరల విజ్ఞప్తులు చేసినా వారు పెడచెవిన పెడుతున్నారని, ఈ విధమైన అతిక్రమణ దారులకు 800 దిర్హాం ల జరిమానా, రెండు వారాలపాటు వారి వాహన స్వాధీనం మరియు వారి ట్రాఫిక్ రికార్డులో 8 బ్లాక్ పాయింట్లు శిక్షగా విధింపబడుతుందని ఆయన తెలియజేప్పారు. ఈ కొత్త కెమెరాలు - రెడ్ సిగ్నల్ అతిక్రమించిన, వేగ పరిమితిని అధిగమించిన, సిగ్నల్స్ వద్ద హఠాత్తుగా దిశ మార్చుకున్న, యెల్లోబాక్స్ లేదా పాదచారుల నడక దారిపై ఆగిన వాహనాల చోదకులను కనిపెట్టగలవని ఆయన హెచ్చరించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







