రెప్పపాటులో కూలిన బ్రిడ్జి
- October 02, 2017
దాదాపు రెండు కిలోమీటర్ల బ్రిడ్జి. రెప్పపాటులో కూలిపోయింది. కాదు.. కాదు.. కూల్చేశారు. ఎప్పుడో 78 ఏళ్ల క్రితం కట్టిన బ్రిడ్జిని.. అమాంతం కూల్చేశారు. కళ్లుమూసి తెరిచేంతలో భారీ బ్రిడ్జి స్థానంలో దట్టమైన దుమ్ము ధూళి కనిపించాయి.
న్యూయార్క్‌లో అతిపెద్ద కౌంటీలైన బ్రూక్లిన్, క్వీన్స్‌లను కలుపుతూ 1939లో కిజ్కియాస్కో అనే బ్రిడ్జిని నిర్మించారు. దీని పొడవు 1.8 కి.మీలు. వెడల్పు 38 మీటర్లు. నాటి అంచనాల దృష్ట్యా రోజుకు 10వేల కార్లు ప్రయాణించగల సామర్థ్యంతో నిర్మించారు. కానీ క్రమంగా కిజ్కియాస్కోపై రోజుకు ప్రయాణించే వాహనాల సంఖ్య లక్షా 80 వేలకు పెరిగింది. దీంతో ప్రమాద అవకాశాలను గుర్తించిన అధికారులు ఈ ఏడాది ప్రారంభం నాటికి కిజ్కియాస్కోకు సమాంతరంగా అధునాతన మీకర్ అవెన్యూ బ్రిడ్జిని నిర్మించారు. ఏప్రిల్, 27నుంచి పాత వంతెనపై రాకపోకలను పూర్తిగా నిలిపేశారు.
అప్పటి నుంచి కొనసాగుతోన్న కూల్చివేత ప్రక్రియ పేల్చివేతతో చివరిదశకు చేరింది. శక్తిమంతమైన డిటోనేటర్లతో జరిపిన పేలుడుకు వంతెనకు సమీపంలోని ఇళ్లు వణికిపోయాయి. కూల్చివేసిన వంతెన స్థానంలో 2020 నాటికి సరికొత్త బ్రిడ్జిని నిర్మించబోతున్నారు
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









