'క్వీన్' వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేసుకున్నారట
- October 03, 2017

హైదరాబాద్: విద్యార్థులు, ఉద్యోగులు, స్నేహితులు ఆసక్తికర విషయాలు పంచుకోవడానికి వాట్సాప్ బృందాలను ఏర్పాటు చేసుకుంటుంటారు. వాట్సాప్ గ్రూప్‌లను సెలబ్రిటీలు కూడా అనుసరిస్తుంటారు. తాజాగా కథానాయికలు తమన్నా, మంజిమ మోహన్, కాజల్ అగర్వాల్, పారుల్ యాదవ్ ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారట.
ఎందుకంటే వీరు నలుగురూ హిందీలో వచ్చిన 'క్వీన్' రీమేక్ చిత్రాల్లో నటిస్తున్నారు. తెలుగులో తమన్నా(క్వీన్), తమిళంలో కాజల్(పారిస్ పారిస్), మలయాళంలో మంజిమ మోహన్(జామ్ జామ్), కన్నడలో పారుల్ యాదవ్(బటర్‌ఫ్లై) చిత్రాల్లో నటిస్తున్నారు. వీరంతా నటించేది ఒకే సినిమా రీమేక్‌లో కావడంతో చిత్ర దర్శకులు, కథానాయికలు ఒక వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేసుకున్నారట.
సినిమా వివరాలను పంచుకోవడానికి ఒకరికొకరు సలహాలు ఇచ్చుకోవడానికి ఇదో సులభమైన మార్గమని ఇలా చేశారట. అంతేకాదు ఈ సినిమా నాలుగు భాషల్లోనూ ఒకేసారి విడుదల కాబోతోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







