3.2 బిలియన్ సౌదీ రియాల్స్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్ట్‌పై మక్కా ఎమిర్ సంతకం
- October 03, 2017
జెడ్డా: మక్కా ఎమిర్, మక్కా డెవలప్‌మెంట్ అథారిటీ ప్రెసిడెంట్ ప్రిన్స్ ఖాలిద్ అల్ ఫైసల్, 3.2 బిలియన్ సౌదీ రియాల్స్ విలువైన మక్కా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌కి సంబంధించిన కాంట్రాక్ట్‌పై సంతకం చేశారు. కింగ్‌డమ్ విజన్ 2030లో భాగంగా ఈ ప్రాజెక్ట్‌ని చేపట్టినట్లు వివరించారాయన. 10 ఏళ్ళకుగాను 400 బస్సుల సప్లయ్, ఆపరేషన్, మెయిన్‌టెనెన్స్‌లను కన్సార్టియమ్ ఈ ఒప్పందం కింద నిర్వహిస్తుంది. వీటిల్లో 240 ఆర్డినరీ బస్సులు ఉంటాయి. 160 ఆర్టికాలిక్యులేటెడ్ బస్సులు ఉంటాయి. అత్యున్నత ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ స్టాండర్డ్స్‌తో ఈ బస్సులు నిర్వహించబడతాయి. తొలి ఫేస్‌లో బస్ నెట్‌వర్క్ 12 లైన్లతో 300 కిలోమీటర్ల మేర ఉంటుంది. వీటిల్లో ఏడు లైన్లు లోకల్‌గా ఉంటాయి. 83 స్టాప్ స్టేషన్స్‌ని ఏర్పాటు చేస్తారు. 172 కిలోమీటర్ల పొడవుతో ఫాస్ట్ లైన్స్ (మిగిలిన ఐదు) ఉంటాయి. బస్‌లకు సంబంధించి కంట్రోల్, ఆపరేషన్స్ కోసం 220,000 చదరపు మీటర్ల వైశాల్యంలో మెయిన్‌టెనెన్స్ సెంటర్‌ని నిర్మించనున్నారు.
తాజా వార్తలు
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్‌డి స్మార్ట్ సిటీ ఇండెక్స్‌లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!









