బహ్రైన్ కొత్త లక్ష్యాలు

- November 02, 2015 , by Maagulf
బహ్రైన్ కొత్త లక్ష్యాలు

ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు మరియు గృహ కల్పన తమ ప్రభుత్వ ముఖ్య ప్రాధాన్యతాలని, అవి స్థిరమైన ప్రగతికి మూలస్తంభాలని బహ్రైన్ అధినేత ప్రధాని హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా, మనామా డైలాగ్ 2015 సందర్భంగా ‘ఐక్య రాజ్య సమితి అభివృద్ధి పధకం డైరక్టర్’ హెలెన్ క్లార్క్ ను కలసిన సందర్భంగా ప్రకటించారు. ఐక్య రాజ్య సమితి సహస్రాబ్ది అభివృద్ది లక్ష్యాల అనంతరం, 'పోస్ట్-2015 డెవలప్‌మెంట్ అజండా' ను విజయవంతం చేయడానికి బహ్రైన్ కట్టుబడి ఉందని ఆయన ప్రకటించారు. రానున్న డిసెంబరు నెలలో జరగనున్న 'పోస్ట్-2015 అరబ్ ప్రపంచంలో నిలకడైన అభివృద్ధి' ని గురించిన సమావేశానికి పోషకత్వం వహించినందుకు UNDP డైరక్టర్ అధినేతకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com