నవంబర్ 7న కమల్ పార్టీ ప్రారంభం!

- October 04, 2017 , by Maagulf
నవంబర్ 7న కమల్ పార్టీ ప్రారంభం!

63వ జన్మదిన వేడుకలు జరుపుకోనున్న తమిళ నటదిగ్గజం కమల్‌హాసన్.. తన పుట్టిన రోజైన నవంబర్ 7వ తేదీన నూతన పార్టీని ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఆయన బుధవారం చెన్నైలో అభిమానులతో సమావేశమయ్యారు. పుట్టినరోజులోపు తన ప్రణాళికలకు తుదిరూపం ఇచ్చే విషయమై చర్చలు జరిపినట్టు సమాచారం. ఇంతకుముందు పలు ఇంటర్వ్యూల్లో వచ్చే ఏడాది జనవరి వరకు రాజకీయాల్లోకి వస్తానని చెప్పిన కమల్.. చెన్నైలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాత్రం తన రాజకీయ ప్రవేశంపై స్పష్టత ఇచ్చినట్లు తెలిసింది. ఇప్పుడున్న పార్టీలేవీ తన భావాలకు తగిన విధంగా లేవని ప్రకటించిన కమల్.. నూతనంగా పార్టీ ప్రారంభించేందుకే మొగ్గు చూపుతున్నారు.

కాగా చెన్నైలో జరిగిన అభిమానుల సమావేశంలో కేవలం పుట్టినరోజున చేపట్టే సేవా కార్యక్రమాల గురించి మాత్రమే చర్చించినట్లు కమల్‌హాసన్ వెల్ఫేర్‌క్లబ్ సీనియర్ సభ్యుడు తంగవేలు వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com