యాంకర్ చిత్ర‌లేఖ‌ ర‌చించిన `వ‌న్నెపూల విన్న‌పాలు` పుస్తక ఆవిష్కరణ

- October 05, 2017 , by Maagulf
యాంకర్ చిత్ర‌లేఖ‌ ర‌చించిన `వ‌న్నెపూల విన్న‌పాలు` పుస్తక ఆవిష్కరణ

క్లాస్ మెట్స్', 'శంభో శివ శంభో', 'పరుగు', 'దమ్ము', లయన్', 'దళం' తదితర చిత్రాల్లో కీలక పాత్రల ద్వారా సిల్వర్ స్ర్కీన్ పై మెరిసిన రాణీ చిత్రలేఖ సుపరిచితురాలే. వెండితెరపైనే కాదు.. బుల్లితెరపై యాంకర్ గా కూడా రాణిస్తున్నారు.  'జస్ట్ ఫర్ ఫన్'  అని 'మా' టీవీలో సందడి చేసినా, 'యాహూ' అని ఈటీవీలో అల్లరి చేసినా, 'స్వరనీరాజనం' అని తీయని స్వరంతో 'జీ తెలుగు'లో మాట్లాడినా, 'ఆట' డ్యాన్స్ షో ద్వారా అలరించినా... ఏ ప్రోగ్రామ్ కైనా, ఏ ఛానల్ కైనా యాంకర్ చిత్రలేఖ న్యాయం చేస్తారు. డ్యాన్స్ షో, టాక్ షో, మ్యూజిక్ షో ఏదైనా ఓకే. అందుకే యాంకర్ గా రాణీ చిత్రలేఖ బోలెడంత పాపులార్టీ తెచ్చుకున్నారు. ఇక, బుల్లితెర నటిగా 'రాధా మధు', 'నాన్న', 'మానసవీణ', 'సీతారామపురం' వంటి సీరియల్స్ ద్వారా నటిగా తానేంటో నిరూపించుకున్నారు. 
యాంకర్‌గా, నటిగా మాత్రమే కాదు.. 'వన్నెపూల విన్నపాలు'తో తనలో మంచి రచయిత్రి కూడా ఉందని నిరూపించుకోవడానికి రాణీ చిత్రలేఖ ఓ అడుగు వేసింది. హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్ లో  ఆమె ర‌చించిన `వ‌న్నెపూల విన్న‌పాలు' పుస్త‌కా విష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం సీనియ‌ర్ ర‌చ‌యిత శివారెడ్డితో పాటు ప‌లువురు  ర‌చ‌యిత‌ల చేతుల మీదుగా జ‌రిగింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com