మహిళలకు శుభవార్త ఇక పై బంగారం కొనుగోలుకు పాన్ కార్డు అవసరం లేదు
- October 06, 2017మహిళలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త వెల్లడించింది. యాభైవేల రూపాయల విలువగల బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన వారు తప్పనిసరిగా పాన్‌కార్డును సమర్పించాలని గతంలో కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ ను ఉపసంహరించుకుంది. ముందుగా రెండులక్షల రూపాయల ఆభరణాలు కొన్నపుడు నో యువర్ కస్టమర్ కింద వారి పాన్ కార్డును అందజేయాలని కేంద్రం ఆదేశించింది. అనంతరం దాన్ని 50వేల రూపాయల కొనుగోళ్లకు కూడా పాన్ కార్డును సమర్పించాల్సిందేనని ప్రకటించింది. ఈ నిబంధన వల్ల బంగారం అమ్మకాలు తగ్గిపోయిందని బంగారం వర్తకులు ఆందోళన చేసిన నేపథ్యంలో కేంద్రం తాత్కాలికంగా ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. కేంద్రం తాజా ఆదేశాలతో దీపావళి పండుగ సందర్భంగా బంగారం విక్రయాలు జోరందుకుంటాయని బంగారం వర్తకులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్‌లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్‌లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







