ఈ రోజు సాయంత్రం విడుదల చేయనున్న రోబో2.0 త్రీడీ మేకింగ్ వీడియో లాంఛ్

- October 07, 2017 , by Maagulf
ఈ రోజు సాయంత్రం విడుదల చేయనున్న రోబో2.0 త్రీడీ మేకింగ్ వీడియో లాంఛ్

రోబో 2.0-గ్రేట్ డైరెక్టర్ శంకర్, రజనీకాంత్ కాంబోలో వచ్చి సంచలన విజయం సాధించింది రోబో. ఈ సినిమాకి సీక్వెల్ గా 2.0 పేరుతో, 350 కోట్ల బడ్జెట్ తో ఇప్పుడు మరో సినిమా వస్తోంది. హాలీవుడ్ స్టాండర్ట్స్ లో అద్బుతమైన విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రజనీకాంత్, అక్షయ్ కుమార్ లాంటి సూపర్ స్టార్స్ ఇందులో లీడ్ పోషిస్తున్నప్పటికీ, శంకర్ ఈ సినిమాకి ప్రమోషన్ ని పక్కా ప్లానింగ్ తో చేస్తున్నాడు. ఈ రోజు రోబో 2.0 టీమ్, ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసేలా ఓ సర్ ప్రైజ్ ప్లాన్ చేసింది.

బాహుబలి: ది కంక్లూజన్’ తర్వాత దేశమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సినిమా ‘2.0’. ఏస్ డైరెక్టర్ శంకర్- సూపర్ స్టార్ రజినీకాంత్ ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ఈ అంచనాలకు తగ్గట్లే సినిమా ఉంటుందన్న సంకేతాలిచ్చేలా కొన్నాళ్ల కిందట ఒక మేకింగ్ వీడియో వదిలాడు శంకర్. అందులోని విన్యాసాలకు జనాల దిమ్మదిరిగింది. ఇప్పుడు మరో ప్రమోషనల్ వీడియోను రెడీ చేసి పెట్టాడు శంకర్. ‘2.0’ పూర్తిగా త్రీడీలో తెరకెక్కిన సంగతి తెలిసిందే. దేశంలోని వేలాది థియేటర్లను ఈ సినిమా కోసమే త్రీడీ హంగులతో తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తోంది చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్. ‘2.0’తో దేశంలోని థియేటర్లలో ఒక త్రీడీ విప్లవం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఐతే ఈ త్రీడీ మేకింగ్ అనేది అంత సులువైన విషయం కాదు. దానికి ఎంతో అవగాహన ఉండాలి. మరెంతో శ్రమించాలి. ఆ శ్రమ ఎలాంటిదో.. తమ సినిమా ప్రత్యేకత ఏంటో చూపించేలా ‘2.0’ త్రీడీ మేకింగ్ వీడియోను సిద్ధం చేశాడు శంకర్. 
రోబో సీక్వెల్ 2.0 మూవీ త్రీడి మేకింగ్ వీడియోని ఈ రోజు సాయంత్రం 6 గంటలకు లాంచ్ చేయబోతున్నట్లు ట్విట్టర్లో వెల్లడించాడు శంకర్. ఈ వీడియోతో ‘2.0’పై అంచనాలు మరింత పెరుగడం ఖాయం.  ‘2.0’ పోస్ట్ ప్రొడక్షన్ ముగింపు దశలో ఉండగా.. వచ్చే మూడు నెలలూ ప్రమోషన్లతో హోరెత్తించాలని చిత్ర బృందం భావిస్తోంది. ఈ నెలలోనే ‘2.0’ టీజర్ రిలీజవుతుంది. వచ్చే నెలలో ఆడియో వేడుక చేస్తారు. డిసెంబర్లో ట్రైలర్ వస్తుంది. 2015 జనవరి 25న ‘2.0’ ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఇలా పక్కా ప్లానింగ్ తో ఉంది చిత్ర యూనిట్. శంకర్, రజనీకాంత్, అక్షయ్ కుమార్ కాంబోలో దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ సంచలనాలకు తెరతీస్తుందో చూడాలి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com