'ఇళయరాజా' గురించి కొన్ని ఆసక్తికరమైన కబుర్లు
- October 07, 2017
"సంగీతం అనేది అలా అవ్వాలి అంతే, దాన్ని మనం ప్రత్యేకం గా స్రుష్టించలేము"- తన సంగీత ప్రతిభ గురించి అడిగినప్పుడు ఇదే ఇళయరాజా గారు చెప్పిన సమాధానం!
ఇళయరజా- ఈ పేరు గురించి ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. అయన కి తెలుగు సినీ సంగీత ప్రెక్షకులే కాదు, దేశ వ్యప్తంగా అభిమానులు ఉన్నారు. ఒక చిత్రనికి నేపధ్య సంగీతం ఎల ఉండాలొ ఒక కొత్త అర్ధాన్ని చెప్పిన సంగీత దర్శకులు ఇళయరాజా. అయన తెలుగు లో తమిళం తర్వత అత్యధిక సినిమాలకి పని చేయడం మన అద్రుష్టం.
చాలా సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఇళయరాజా గరు హైదరాబాదు లో తన సంగీత బృందంతో ముందుకు వచ్చి అలరించనున్నారు. ఈ కార్యక్రమన్ని టెంపుల్ బెల్ల్ ఎవెంట్స్ వాళ్ళు అట్టహాసం గా నిర్వహించనున్నారు. ఈ సందర్భం గా ఇళయరాజా గారి గురించి కొన్ని వైవిధ్యమైన విశేషాలు:
1. సినిమా సంగీతం ఒకటే కాదు, ఇళయరాజా గారు కొన్ని అంతర్జతీయ సంగీతాన్ని కూడా చేశారు - అందులో ప్రాముఖ్యమైనవి - హౌ టు నేం ఇట్, తిరువాచకం, రామాయణం.
2. ఇళయరాజా గారు చాలా ఆధ్యాత్మిక వ్యక్తి. రమణ మహర్షి భక్తులు. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు ఆయన తిరువన్నామలై దర్శించుకొని ప్రదక్షిణం తప్పక చేస్తారు.
3. పని విషయం లో ఇళయరాజా గారు చాలా కఠినం గా ఉంటారు. రికార్డింగ్ రోజూ పొద్దున్న ఏడు గంటలకు మొదలౌతుంది. ఒక్క నిమిషం అలస్యం ఐనా, వాయిద్య కారులు గానీ, గాయకులు కానీ బయట ఉండాల్సిందే!
4. సినీ సంగీత ప్రపంచానికి చాలా మంది గొప్ప గాయకులు- చిత్ర, మనో, స్వర్ణ లత , బొంబయ్ జయస్రీ- వీరందరూ ఇళయరాజా గారి సంగీతం నుంచే పరిచయం అయ్యారు!
5. తమిళుడు అయినా, ఇళయరాజా గారి తెలుగు పాటల్లో గొప్ప తెలుగుతనం ఉంటుంది.
6. ఇళయరాజా గారు తన మొదటి జీతం తో కొనుక్కున్న హార్మోనియం ఖరీదు రూ. 200. ఇప్పటికి దానిమీదే స్వర కల్పన చేస్తారు.
7. ఇళయరాజా గారికి ఫొటోగ్రఫి అంటే చాలా మక్కువ ఎక్కువ. దర్శకుడు వంశీ తో కలిసి తమిళ నాడు అడవి ప్రాంతాల్లో గొప్ప చిత్రాలు తీశారు.
8. అయనకి వచ్చిన నాలుగు జాతీయ పురస్కారాల్లో, రెండు చిత్రాలు తెలుగు వే! సాగర సంగమం, రుద్రవీణ.
9. ఇప్పుడు ఉన్న చాలా గొప్ప సంగీత దర్శకులు- విద్యసాగర్, దేవిశ్రీ ప్రసాద్, మణిశర్మ - వీరు అంతా ఇళయరాజా అభిమానులు. మణిశర్మ స్టుడియో లో,మరియు దేవిశ్రీ ప్రసాద్ స్టుడియో లో ఇళయరాజా గారి చిత్రపఠం ఉంటుంది.
10. ఏ. ఆర్. రహ్మాన్ కొన్ని రోజులు ఇళయరాజా దగ్గర కీబోర్డు సహాకరం లో పని చేసారు.
11. బాలక్రిష్ణ చిత్రం అదిత్య 369 కి ఇళయరాజా గారు ముప్పై నిమిషాల్లొ పాటలు స్వరపరిచారు!
ఇలాంటి గొప్ప సంగీత దర్శకుడి కార్యక్రమాన్ని తెలుగు ప్రేక్షకుల కోసం హైదరాబాద్ తీసుకువస్తున్న టెంపుల్ బెల్ల్ ఈవెంట్స్ వారికి ధన్యవాదాలు. ఇలాటి కార్యక్రమం చాలా అరుదు గా జరుగుతుంది!
- నవ్య సి (మాగల్ఫ్ ప్రతినిధి, హైదరాబాద్)
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









