సౌదీ అరేబియాకు అమెరికా అత్యాధునిక ఆయుధాల అందచేత
- October 07, 2017
సౌదీఅరేబియా : ప్రపంచ దేశాలకు పెద్దన్న సౌదీ అరేబియాకు 15 బిలియన్ డాలర్ల విలువ చేసే ఆయుధాలు ఆయుధాలను అందచేసింది. ఇరుగు పొరుగు దేశాలతో శాంతి, సుస్థిరతలను కాపాడేందుకు సౌదీకి అత్యాధునిక ఆయుధాలను అందించనున్నట్లు పెంటగాన్ వర్గాలు వివరణ ఇస్తున్నాయి. ఇటీవల ట్రంప్ పర్యటనలో భాగంగా సౌదీ, అమెరికాల మధ్య కుదిరిన రక్షణ ఒప్పందంలో భాగంగా ఈ అత్యాధునిక ఆయుధాలు సౌదీకి పంపుతున్నామని అమెరికా రక్షణ శాఖ చెబుతోంది. ప్రపంచదేశాలకు ఇరాన్, ఉత్తరకొరియాల ముప్పు రోజు రోజుకి పెరుగుతున్నదని పెంటగాన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆ క్రమంలోనే సౌదీకి 15 బిలియన్ డాలర్ల విలువ చేసే ఆయుధాలు అందజేయనున్నట్లు తెలిపింది. నిజానికి ఇరాన్ అణు పరీక్షలు గల్ఫ్ దేశాలను తీవ్రంగా కలవరపెడుతోందని ఆరోపిస్తోంది. గల్ఫ్ దేశాలు ప్రమాద అంచుల్లో ఉన్నట్లు ఈ సందర్భంగా హెచ్చరిస్తోంది.అందుకే ముందు జాగ్రత్త చర్యగా సౌదీ 44 టర్మీనల్ హై అల్టీట్యూడ్ ఏరియా డిఫెన్స్(తాడ్) లాంచర్లతోపాటు 360 రాడార్లను కూడా సౌదీ కోనుగోలు చేసిందని పెంటగాన్ తెలిపింది. అమెరికా రక్షణశాఖ కూడా సౌదీకి ఆయుధాల విక్రయాన్ని ద్రువీకరించింది. గల్ఫ్ దేశాల్లో కూడా పరిస్థితులు చేజారుతున్నాయని ఒకవైపు చమురు సంక్షోబం, మరో వైపు ఇరాన్ అణ్వాయుధాల ముప్పు గల్ఫ్ దేశాలకు శాపంగా మారిందని అమెరికా రక్షణశాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇరాన్ అణు పరీక్షలను వెంటనే నిలిపేయాలని అమెరికా రక్షణశాఖ సూచించింది. అందుకు సౌదీతోపాటు మిగతా గల్ఫ్ దేశాలన్ని ఇరాన్ అణు పరీక్షలను ఆపేందుకు కృషిచేస్తున్న తమకు సహకరించాలని అమెరికా రక్షణశాఖ కోరింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..







