రొమ్ము కాన్సర్ అవగాహనకై జరిపిన కృషికి గాను కతార్ ఎయిర్ వేస్ కి అవార్డు

- November 03, 2015 , by Maagulf
రొమ్ము కాన్సర్ అవగాహనకై జరిపిన కృషికి గాను  కతార్ ఎయిర్ వేస్ కి అవార్డు

ప్రపంచ వ్యాప్తంగా మహిళలకు వచ్చే ప్రాణాంతక  వ్యాధి అయిన రొమ్ము కాన్సర్ ను గురించిన ‘రొమ్ము కాన్సర్ అవగాహనా మాసం’లో అనేక కార్యక్రమాలను చేపట్టినందుకు కతార్ ఎయిర్ వేస్ వారికీ ఇటీవల దోహా లో జరిగిన 'బ్యూటీ అండ్ బెస్ట్ అవార్డు' ప్రదానం జరిగింది. ఇందుకు గాను 83,000 కతార్ రియాల్లు బహుమానం వరించింది. ఈ సందర్భంగా కతార్ ఎయిర్ వేస్  సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రోస్సేన్ దిమిత్రేవ్ మాట్లాడుతూ, తమ సంస్థ నుండి కతార్ కేన్సర్ సొసైటీ వారికీ రొమ్ము కాన్సర్ పై పరిశోధన మరియు అవగాహనకై అందజేయడం తమకు గర్వకారణమని, తమ మహిళా ఉద్యోగులకు కూడా తాము సమాచార సమావేశాలను ఏర్పాటు  చేసామని ఆయన వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com