"మైత్రీం భజతాం"

- November 02, 2015 , by Maagulf

 ఇది కంచి పరమాచార్యుల వారి రచన. మనందరం ఏమేం చెయ్యాలో చెప్పే ఈ ప్రార్థనా గీతానికి సంగీతం శ్రీ వసంత దేశాయి గారు సమకూర్చగా, భారతరత్న-సంగీతకళానిధి యమ్మెస్ సుబ్బలక్ష్మి గారు దీన్ని 1966లో ఐక్యరాజ్యసమితిలో పాడారు.
మైత్రీం భజతాం అఖిల హృద్ జేత్రీం 
ఆత్మవదేవ పరానపి పశ్యత 
యుద్ధం త్యజత స్పర్థాం త్యజత 
త్యజత పరేషు అక్రమమాక్రమణం ।మైత్రీం। 
జననీ పృథివీ కామదుఘాస్తే 
జనకో దేవ: సకల దయాళు: 
దామ్యత దత్తా దయధ్వం జనతా: 
శ్రేయో భూయాత్ సకల జనానాం
తోటివారి పట్ల మైత్రిని పెంపొందించుకో, స్నేహంతో అందరి హృదయాలలోనూ నువ్వే నిండిపో, అందరిలోఉండే ఆత్మ ఒక్కటే అది నీలోనూ ఉన్నది నీలో ఉన్నదే అందరిలోనూ ఉన్నది. వారు వేరే నువ్వు వేరే కాదు. అనవసర స్పర్థలు, వైరుధ్యాలు వద్ధు. యుద్ధాన్ని త్యజించు, స్పర్థలను త్యజించు, అక్రమమైన ఆక్రమణలను త్యజించు. ఈ భూమి మన తల్లి, మన సమస్త కోర్కెలు తీర్చే కామధేనువు వంటిది. తల్లి కొరకు కొట్లాట వద్దు. ఆ దేవుడు మనందరికీ తండ్రి దయాళువు వారివురూ పరమ దయామూర్తులు. వారి పుత్రులమైన మనం కరుణనింపుకొని ఉండాలి. నీలో దయను పెంపొందించుకో, లోకములో జనులందరికీ శుభము కలగాలి, అందరూ క్షేమంగా ఉండాలి.

 

మూలం : కంచి కామకోటి  పరమాచార్యుల వారి రచన

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com