రఘురాం రాజన్ కు నోబెల్ అవకాశం ఉందా?
- October 07, 2017
న్యూఢిల్లీ: ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి-2017 ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ను వరించే అవకాశం ఉందని క్లారివేట్ ఎనలైటిక్స్ పేర్కొంది. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రధానం కోసం నోబెల్ కమిటీ ఎంపిక చేసిన జాబితాలో రాజన్ పేరు ఉన్నట్లు తెలిపింది. కాగా, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ విన్నర్ పేరు సోమవారం అధికారికంగా వెలువడనుంది.
నోబెల్ ప్రైజ్ ఎవరు గెలుస్తారన్నదానిపై క్లారివేట్ ఎనలైటిక్స్ పేర్కొన్న పేర్లు ఆసక్తిని కల్గిస్తున్నాయి. నోబెల్ పురస్కారానికి తగిన పరిశోధనలు చేసిన ఆరుగురు ప్రముఖుల పేర్లను క్లారివేట్ పేర్కొంది. రాజన్ ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ చికాగోలోని బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో సర్వీస్ ప్రొఫెసర్ ఆఫ్ ఫైనాన్స్ గా పని చేస్తున్నారు. 2013లో ఆర్బీఐ గవర్నర్ గా పని చేస్తున్న సమయంలో బ్రిటిష్ మేగజిన్ సెంట్రల్ బ్యాంకింగ్స్ సెంట్రల్ బ్యాంకర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికయ్యారు. రాజన్ ఐఐటీ, ఢిల్లీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









