'సంజూ' బయోపిక్ కు టైటిల్ కంఫర్మ్

- October 07, 2017 , by Maagulf
'సంజూ' బయోపిక్ కు టైటిల్ కంఫర్మ్

రాజ్‌కుమార్‌ హిరానీ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ హీరోగా సంజయ్ దత్ బయోపిక్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇప్పుడీ సినిమా టైటిల్ ఫిక్స్ అయినట్టు సమాచారమ్. 'సంజూ' టైటిల్ ని ఫైనల్ చేసినట్టు చెబుతున్నారు. బాలీవుడ్ లో సంజయ్ దత్ ని సంజూ, సంజూ బాబా అని పిలుస్తుంటారు. ఇండస్ట్రీలో ఆ ఫీల్ ని తీసుకొచ్చేందుకు సంజయ్ దత్ బయోపిక్ కి సంజూ టైటిల్ ని ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అయితే, టైటిల్ విషయంలో చిత్రబృందం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
సినిమాలో పరేశ్‌ రావల్‌, మనీషా కోయిరాలలు సునిల్‌ దత్‌, నర్గీస్‌ పాత్రలను పోషించనున్నారు. సోనమ్‌ కపూర్‌, దియా మీర్జా, అనుష్కా శర్మలు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. లీడ్ రోల్ పోషిస్తున్న రణ్ బీర్ సంజూ దత్ గెటప్ లో ఒదిరిపోయినట్టు కనబడుతోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com