'తెలంగాణ ప్రజా సమితి-ఖతార్' నేతృత్వంలో మహా బతుకమ్మ,దసరా మరియు బక్రీద్ సంబరాలు

- October 08, 2017 , by Maagulf

ఖతార్: ఖతార్‌లో గుర్తింపు పొందిన ఇండియన్‌ కల్చరల్‌ సెంటర్‌కి అనుబంధంగా ఉన్న 'తెలంగాణ ప్రజాసమితి' ఆధ్వర్యంలో మహా బతుకమ్మ, దసరా అలాగే బక్రీద్‌ సంబరాలు జరిగాయి. ఖతార్‌లో ఇండియన్‌ ఎంబాసిడర్‌ పి.కుమరన్‌ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తెలంగాణ ప్రజా సమితి నిర్వహిస్తున్న కార్యక్రమాల్ని ఈ సందర్భంగా వక్తలు అభినందించారు. టిపిఎస్‌ ప్రెసిడెంట్‌, శ్రీధర్‌ అబ్బగౌని మాట్లాడుతూ, తమ సంస్థ సోషల్‌ అలాగే వెల్ఫేర్‌ కార్యక్రమాల్ని చేపడుతోందని చెప్పారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబించేందుకు అవకాశం రావడం గొప్ప విషయమని చెప్పారాయన. ఖతార్‌లో తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో వచ్చినవారున్నారని, అలాంటివారిలో కొత్త ఉత్సాహం నింపేందుకు టీపీఎస్‌ పలు కార్యక్రమాల్ని కొనసాగిస్తుందని వివరించారు శ్రీధర్‌. ఫోక్‌, క్లాసికల్‌ డాన్సులు, మోడ్రన్‌ నృత్యాలు ఆహూతుల్ని అలరించాయి.

--రాజ్ కుమార్ వనంబత్తిన (మాగల్ఫ్ ప్రతినిధి,కతర్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com