జూపార్క్‌లో కేర్ టేకర్ ప్రాణం తీసిన తెల్ల పులులు

- October 08, 2017 , by Maagulf
జూపార్క్‌లో కేర్ టేకర్ ప్రాణం తీసిన తెల్ల పులులు

బెంగళూరు బన్నేర్‌గట్ట జూపార్క్‌లో కేర్ టేకర్ ప్రాణం తీశాయి రెండు తెల్ల పులులు. నిన్న సాయంత్రం వాటికి ఆహారం పెట్టడానికి ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన ఆంజనేయపై ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ దాడి జరుగుతున్న విషయాన్ని సిబ్బంది ఎవరూ గుర్తించలేదు. దీంతో.. అతడిని కాపాడలేకపోయారు. పులుల దాడిలో ఆంజనేయకు తీవ్ర గాయాలు కావడంతో.. టైగర్‌ ఎన్‌క్లోజర్‌లోనే ప్రాణం వదిలాడు. 
ఆంజనేయ మృతితో.. ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు జూపార్క్‌ దగ్గర ఇవాళ ఉదయం ఆందోళనకు దిగారు. అయితే.. విషయం తెలుసుకున్న అధికారులు మాత్రం... మొహం చాటేశారు. ఒక్కరు కూడా జూపార్క్ దగ్గరకు వచ్చి.. ఆంజనేయ కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. స్థానిక నేతలు కొంతమంది.. ఆంజనేయ కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు. అధికారులు మాత్రం ఈ దాడి ఎలా జరిగిందన్న దానిపై ఆరా తీస్తున్నామంటున్నారు. జూ పార్క్‌లో మరోసారి ఇలాంటి దాడి జరగకుండా చర్యలు తీసుకుంటామంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com