వినని డైలాగ్స్ తో వస్తున్న 'అర్జున్ రెడ్డి'

- October 08, 2017 , by Maagulf
వినని డైలాగ్స్ తో వస్తున్న 'అర్జున్ రెడ్డి'

హైదరాబాద్‌: చిన్న సినిమాగా విడుదలై, పెద్ద విజయం సాధించిన చిత్రం 'అర్జున్‌రెడ్డి'. కేవలం రూ.4 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం రూ.40 కోట్లు రాబట్టింది. కాగా ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్‌ను సెన్సార్‌ చేశారు. అయితే ఆ డైలాగ్‌ ఉండే కాపీని విడుదల చేయనున్నట్లు సమాచారం. అమేజాన్‌ ప్రైం వీడియోస్‌ అక్టోబరు 13న సెన్సార్‌ చేయని కాపీని సబ్‌టైటిల్స్‌తో సహా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. సినిమా నిడివిని కుదించే క్రమంలో అనేక ముఖ్యమైన సన్నివేశాలను తీసేయాల్సి వచ్చిందని ఓ సందర్భంలో హీరో విజయ్‌ దేవరకొండ తెలిపారు.
విజయ్‌ దేవరకొండ, షాలిని పాండే ఈ చిత్రంలో జంటగా నటించారు. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. ప్రణయ్‌రెడ్డి వంగా చిత్రాన్ని నిర్మించారు. రధన్‌ స్వరాలు సమకూర్చారు. ప్రేమకథతో తెరకెక్కించిన ఈ చిత్రం విమర్శకులు, ప్రముఖుల ప్రశంసలు అందుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com