తెలంగాణ బస్టాండ్లలో ఆర్టీసీ మినీ థియేటర్లు.!

- October 09, 2017 , by Maagulf
తెలంగాణ బస్టాండ్లలో ఆర్టీసీ మినీ థియేటర్లు.!

పెరగనున్న ప్రయాణికులు
ఆదాయం పెంచుకునే దిశగా అధికారుల కసరత్తు
ప్రయాణంలోనే వినోదం, ఆహ్లాదాన్ని అందించేందుకు ప్రాధాన్యతనిస్తోన్న హైదరాబాద్‌ మెట్రోరైల్‌ లిమిటెడ్‌(హెచ్‌ఎంఆర్‌)కు దీటుగా రవాణా సేవలు మెరుగుపర్చాలని ఆర్టీసీ భావిస్తోంది. అదే తరహాలో ఆకర్షణీయ ప్రాంగణాలు.. అధునాతన సేవలు అందించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 31 బస్టాండ్లలో మినీ థియేటర్లను అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. గ్రేటర్‌లో ఐదు బస్టాండ్ల్లలో మినీ థియేటర్లు అందుబాటులోకి తీసుకువచ్చి ప్రయాణికులను ఆకర్షిస్తూ ఆదా యం పెంచుకునేలా ద్విముఖ వ్యూహం అవలంభిస్తోంది. ఇప్పటికే రూ.9.5కోట్లతో ఎంజీబీఎస్‌, జేబీఎస్‌ బస్టాండ్లను పూర్తిస్థాయిలో ఆధునీకరించడంతోపాటు డిజిటల్‌ అడ్వటైజింగ్‌ బోర్డులతో బస్టాండ్‌కు కొత్తరూపును తీసుకువచ్చారు. బస్టాండ్లలో ప్రయాణికులకు అవసరమైన వసతులు కల్పించడంతోపాటు ఆదాయ కోణంలో దుకాణాలనూ ఆధునీకరించారు. ఇదే తరహాలో నగరంలోని లోకల్‌, జిల్లా బస్సులు రాకపోకలు సాగించే ప్రయాణ ప్రాంగణాలకూ ఆధునిక హంగులు హద్దుతున్నారు.
5 బస్టాండ్లలో మినీ థియేటర్లు..
టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్‌ జోన్‌ పరిధిలో మెదట 5 బస్‌స్టేషన్లలో మినీథియేటర్లు అందుబాటులోకి తీసుకువచ్చేలా టెండర్లను ఆహ్వానించింది. సికింద్రాబాద్‌, జేబీఎస్‌, కూకట్‌పల్లి, మేడ్చల్‌, ఇబ్రహీంపట్నంలోని బస్‌స్టేషన్లలో మినీ థియేటర్లు అందుబాటులోకి తీసుకువచ్చి ఆదాయం పెంచుకునేలా అడుగులు వేస్తోంది. మినీ థియేటర్లు ప్రారంభమైతే బస్‌స్టేషన్లకు వచ్చే ప్రయాణికుల సంఖ్య కొంత పెరిగే అవకాశాలుంటాయని అధికారులు భావిస్తున్నారు.
దుకాణ సముదాయాలు..
సువిశాల విస్తీర్ణంలో ఉన్న బస్టాండ్లలో మినీ థి యేటర్లు, దుకాణ సముదాయాల ఏర్పాటుకు చ ర్యలు తీసుకుంటున్నారు. బస్టాండ్లలో ఉన్న స్థలాన్ని బట్టి దేనికి ఎంత విస్తీర్ణం కేటాయించాలనేది నిర్ణయిస్తారు. ఎన్ని మినీ థియేటర్లు వస్తాయి..? మిగతా స్థలాన్ని ఎలాంటి అవసరాలకు ఇవ్వాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. థియేటర్ల నిర్మాణాన్ని ప్రైవేట్‌ వ్యక్తులు, సంస్థలకు అప్పగించనున్నారు. ఖర్చులు మొత్తం వారు భరిస్తే.. లీజు ప్రాతిపదికన నిర్ణీత కాలంపాటు వారికి కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. దీం తో సంస్థపై ఆర్థిక భారం పడకపోగా.. ఆదాయమూ పెరుగుతుందన్నది అధికారుల ఆలోచన.
నేడు ప్రీ బిడ్‌ సమావేశం..
మినీ థియేటర్ల నిర్వహణకు అసక్తి గల బిడ్డర్ల నుంచి ఆర్టీసీ అధికారులు టెండర్లను ఆహ్వానించారు. మినీ థియేటర్ల నిర్వహణ టెండర్ల నియమ, నిబంధనలతో పాటు ఇతరత్ర అంశాలపై బిడ్డర్లకు అవగాహన కల్పించేందుకు మంగళవారం ఉద యం 10 గంటలకు బస్‌భవన్‌లో బిడ్‌ సమావేశం నిర్వహిస్తున్నారు. మినీ థియేటర్ల కోసం టెండర్ల దాఖలుకు ఈ నెల 30 వరకు అవకాశం ఉంటుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com