షార్జా కారు దొంగల అరెస్ట్
- October 09, 2017
షార్జా పోలీసులు కార్ల దొంగల ముఠాని పట్టుకున్నారు. షార్జాలోని అల్ మజాజ్, అల్ నధా మరియు అల్ తవూన్ ప్రాంతాల్లో పార్క్ చేసిన కార్లలో ఈ దొంగల ముఠా దొంగతనాలు చేస్తూ వస్తోంది. దొంగతనాలపై పలువురు బాధితులు చేసిన ఫిర్యాదుల మేరకు పోలీసులు పక్కా వ్యూహం పన్ని దొంగల ముఠాని కటకటాల వెనక్కి పంపారు. డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ కొన్ని టీమ్‌లను ఏర్పాటు చేసింది ఈ ముఠాని పట్టుకునేందుకు. విచారణ సందర్భంగా నిందితుల్ని గుర్తించిన టీమ్‌లు, వారిని వ్యూహాత్మకంగా అదుపులోకి తీసుకున్నాయి. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. ఎక్కువ సమయం పార్కింగ్‌లో ఉన్న వాహనాల్ని టార్గెట్‌గా చేసుకుని దొంగతనాలు చేస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు. ఎవరూ లేని సమయంలో కార్లను ట్రక్‌లోకి ఎక్కించి, వాటిని ఇంకో చోటకి తీసుకెళ్ళి విక్రయిస్తున్నామని నిందితులు పేర్కొన్నారు. కొన్ని కార్లను డిస్మాంటిల్ చేసి, స్పేర్‌పార్టులుగా వాటిని విక్రయిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్‌పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్‌లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..







