వీసాకై దరఖాస్తు చేస్తున్నపుడు ఒమాన్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

- November 03, 2015 , by Maagulf
వీసాకై దరఖాస్తు చేస్తున్నపుడు ఒమాన్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఒమాన్ ప్రజలు వీసాల కొరకు దరఖాస్తు చేసేటపుడు చాల అప్రమత్తంగా ఉండాలని, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు తమ ట్వీటర్ ద్వారా విజ్ఞప్తి చేసారు. భారత దేశంలో వైద్య సేవలు పొందడానికి, టూరిస్టు వీసాతో వెళ్ళిన ఒమాన్ దంపతులు గత సోమవారం  చెన్నై విమానాశ్రయం లో చిక్కుబడిపోయిన నేపధ్యంలో, అధికారులు ఆ విధంగా వైద్య సేవల కోసం భారత దేశం లేదా ఏ ఇతర దేశాలకు వెళ్ళినపుడైనా కచ్చితంగా మెడికల్ వీసా కొరకు మాత్రమే దరఖాస్తు చేయాలనీ వారు సూచించారు. మెడికల్ వీసా పొందడానికి, చికిత్సకు సంబంధించిన మెడికల్ రికార్డులను సమర్పించవలసి ఉంటుందని, ఇది ఖరీదైన వ్యవహారమవటం వలన కొందరు ప్రజలు టూరిస్టు వీసాతో ప్రయాణించి, ఇతర దేసాలనిబంధనలను అతిక్రమిస్తున్నారని సదరు శాఖ అధికారి ఒకరు ఒకరు విశ్లేషించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com