ఇండికేటర్స్ వినియోగించకపోవడం కూడా ఉల్లంఘనే
- October 12, 2017
మస్కట్: వాహనదారుడు తన వాహనాన్ని నడుపుతున్న సమయంలో కుడి వైపుకు లేదా ఎడమవైపుకు తిరగాలనుకుంటే, సంబంధిత ఇండికేటర్స్ వినియోగించాలనీ, అలా వినియోగించకపోవడం కూడా ఉల్లంఘన కిందకే వస్తుందని రాయలఠ్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. ఈ తరహా ఉల్లంఘనకు పాల్పడితే 15 ఒమన్ రియాల్స్ జరీమానా తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రోడ్లపై వెళుతూ అకస్మాత్తుగా లేన్లు మారిపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయనీ, ఇండికేటర్లను వినియోగించడం ద్వారా ప్రమాదాలను నియంత్రించవచ్చునని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. చిన్న చిన్న తప్పిదాలే పెను ప్రమాదాలకు దారి తీస్తున్నందున, ఇతర వాహనాలను గౌరవించి వాహనదారులు తమ వాహనాల్ని నడిపేటప్పుడు ఇండికేటర్స్ తప్పనిసరిగా వాడాలనీ, బ్రేక్ లైట్ సహా వాహనంలో అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుని వాహనాల్ని నడపాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







