బహ్రైన్ ప్రభుత్వ కంపెనీలలో బోనస్ ల కుదింపు

- November 04, 2015 , by Maagulf
బహ్రైన్ ప్రభుత్వ కంపెనీలలో బోనస్ ల కుదింపు

బహ్రైన్ ప్రభుత్వ వాటా 50 శాతం కన్నా ఎక్కువగా ఉన్న అధారిటీలు, సంస్థలు, ప్రభుత్వ పార్టీలు మరియు కంపెనీలలో  కార్పోరేట్ బోర్డ్ హెడ్ మరియు సభ్యులకు చెల్లించే బోనస్ లను నియంత్రించనున్నట్టు , వారాంతపు మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాని హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల ఖలీఫా ఉత్తర్వులు జారీ చేసారు. ఆర్ధిక వ్యవహారాలు మరియు ఖర్చు నియంత్రణా  మంత్రి వర్గ కమిటీ ని ఈఅంశంపై  నివేదిక సమర్పించవలసిందిగా  ఆదేశించారు. ఇంకా ఇతర అంశాలపై మాట్లాడుతూ, ఏ విధమైన కాల యాపన లేకుండా ముందుగా నిర్ణయించబడిన డెడ్-లైన్లను అధిగమించడానికి అన్నివిధాల కృషిచేసి,  అభి వృద్ధి పధకాలను వేగవంతం చేయాలనీ ఆయన అధికారులకు, మంత్రులకు హితవు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com