రెండు భాషల్లో ఎన్టీఆర్ బయోపిక్..!!
- October 13, 2017నందమూరి తారకరామారావు జీవితకథ ఆధారంగా ఆయన తనయుడు, హీరో నందమూరి బాలకృష్ణ బయోపిక్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పనులు ఊపందుకున్నాయి. దర్శకుడు తేజ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్న ఈసినిమాను తెలుగుతో పాటు హిందీలోనూ రూపొందించనున్నారట. ఈ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు.
అయితే ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఓ సినిమాను రూపొందిస్తున్నాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించి అక్టోబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. దీంతో ఈ రెండు చిత్రాల్లో ఎన్టీఆర్ జీవితాన్ని ఎవరు ఎలా చూపిస్తారో అని అభిమానులు ఆసక్తిగా గమనిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం