వరంగల్ లోక్‌ సభ ఉప ఎన్నికకు ర్వే సత్యనారాయణ ఎంపికయ్యారు

- November 04, 2015 , by Maagulf
వరంగల్ లోక్‌ సభ ఉప ఎన్నికకు ర్వే సత్యనారాయణ ఎంపికయ్యారు

వరంగల్ లోక్‌ సభ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ఎంపికయ్యారు. కాసేపట్లో ఆయన నామినేషన్ వేయనున్నారు. తన ఇంట్లో విషాదం చోటు చేసుకోవడంతో సిరిసిల్ల రాజయ్య పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో అదిష్టానం సర్వేను అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఆయనతో దిగ్విజయ్ సింగ్ మాట్లాడారు. రాజయ్య తప్పుకోవడంతో వరంగల్ లో పోటీ చేయాలని కోరారు. అధిష్టానం ఆదేశాలతో ఉప ఎన్నిక బరిలోకి దిగేందుకు ఒప్పుకున్నారు. రాజయ్యను ఎంపిక చేయకముందే ఆయన వరంగల్ స్థానాన్ని ఆశించారు. ఊహించని పరిణామాలతో చివరికి ఆయకే టిక్కెట్ దక్కింది. నామినేషన్ వేసేందుకు బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి హుటాహుటిన వరంగల్ కు బయలువేరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com