13 ఏళ్లుగా ధోనీ రాక కోసం అమ్మ కానీ అమ్మ వెయిటింగ్

- October 13, 2017 , by Maagulf
13 ఏళ్లుగా ధోనీ రాక కోసం అమ్మ కానీ అమ్మ వెయిటింగ్

వెస్ట్ బెంగాల్, ఖరగ్‌పూర్‌కు చెందిన 77 ఏళ్ల కళావతి ధోనీ కోసం వెయిట్ చేస్తోంది. మాజీ కెప్టన్ మహేంద్రసింగ్ ధోనీ ఫస్ట్  టికెట్ కలెక్టర్ గా ఉద్యోగం చేసిన విషయం తెలిసిందే. ఐతే ఆయన పోస్టింగ్ ఖరగ్‌పూర్‌ సౌత్ సైడ్ రైల్వేలో  పడింది. దీంతో ఆయన అక్కడే ఓ అద్దె ఇంట్లో ఉండేవాడు. అక్కడ కళావతి ధోనికి హెల్పర్ గా ఉండేది. ఆమె వంట తప్ప మిగతా అన్ని పనుల్లో ఆయనకు సహాయకారిగా  ఉండేది. ఓ సారి ధోనీ తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు కళావతే దగ్గర ఉండి అన్ని పనులు చేసిందట. అప్పటి నుంచి కళావతిని అమ్మగా పిలవడం మొదలు పెట్టాడట ధోని. ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత  ఇండియన్ క్రికెట్ టీమ్ లో ఆడే అవకాశం రావడంతో ...అక్కడి నుంచి వెళ్లిపోయాడట. వెళుతూ...వెళుతూ ...మళ్లీ వచ్చి నిన్ను తప్పక కలుస్తానని చెప్పి వెళ్లాడట. ఈ మాట చెప్పి దాదాపు 13 ఏళ్లు గడిచాయని  ...ఇప్పటికీ ఆయన కోసం వెయిట్ చేస్తున్నట్టు కళావతి తెలిపింది. ఇటీవల ఖరగ్ పూర్ నుంచి వాసూరావు ధోనీని కలిసినప్పుడు అమ్మ ఎలా ఉంది అని యోగ క్షేమాలు ఆరా తీసాడట...అమ్మను చూడటానికి తప్పకుండా వస్తానని తెలపడంతో ఈ విషయం బయటికి వచ్చింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com