తొలిసారి ఫైనల్లో మరియా షరపోవా
- October 14, 2017
టియాంజిన్: ఐదుసార్లు గ్రాండ్‌స్లామ్ విజేత, ప్రపంచ మాజీ నంబర్‌వన్, రష్యా అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి మరియా షరపోవా తొలిసారి ఫైనల్‌కు చేరుకుంది. అదేంటి ఐదు సార్లు గ్రాండ్‌స్లామ్ విజేత ఇప్పుడు తొలిసారి ఫైనల్‌కు చేరడమేమిటని ఆశ్చర్యపోతున్నారా. ఎందుకంటే.. నిషేధిత ఉత్ప్రేరకం మెల్డోనియం వాడినట్లు వాడా నిర్వహించిన పరీక్షల్లో తేలడంతో షరపోవాపై 15 నెలలు వేటు వేసిన సంగతి తెలిసిందే. నిషేధం ముగించుకుని తిరిగి రాకెట్ పట్టిన రష్యా భామ వైల్డ్ కార్డు ద్వారా పలు టోర్నీలు ఆడింది. కానీ, ఏ ఒక్కసారి ఫైనల్‌కు చేరుకోలేదు.
తాజాగా చైనాలో జరుగుతోన్న టియాంజిన్ ఓపెన్‌లో షరపోవా తొలిసారి మహిళల సింగిల్స్‌లో ఫైనల్‌కు చేరుకుంది. శనివారం జరిగిన సెమీస్‌లో చైనా క్రీడాకారిణి పెంగ్‌తో జరిగిన పోరులో 3-6, 1-6తో షరపోవా విజయం సాధించి ఫైనల్ చేరుకుంది. ఆదివారం షరపోవా.. బెలారస్ క్రీడాకారిణి సబలెంకతో తలపడనుంది. ప్రస్తుతం షరపోవా 86వ ర్యాంకులో కొనసాగుతండగా...
19 ఏళ్ల సబలెంక 102వ ర్యాంకు దక్కించుకుంది. ఆదివారం జరిగే ఫైనల్లో తొలి డబ్ల్యూటీఏ టైటిల్ గెలవాలని సబలెంక భావిస్తుండగా షరపోవానే టైటిల్ ఫేవరేట్‌గా కనిపిస్తోంది. విజయం ఎవర్ని వరిస్తుందో వేచి చూద్దాం.
ఏప్రిల్‌లో స్టుగార్ట్‌లో జరిగిన టోర్నీలో గాయం కారణంగా సెమీస్ నుంచి నిష్క్రమించింది.
ఆ తర్వాత ఇటాలియన్ ఓపెన్‌లో రెండో రౌండ్లో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగింది.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







