హత్య చేసి.. ముక్కలు చేసి.. ఫ్రిజ్డ్‌లో పెట్టిన వైనం

- October 14, 2017 , by Maagulf
హత్య చేసి.. ముక్కలు చేసి.. ఫ్రిజ్డ్‌లో పెట్టిన వైనం

ఢిల్లీలో ఐదు రోజుల క్రితం మిస్సైన ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ముక్కలు చేసిన అతడి బాడీ ఒక ఫ్రిజ్డ్‌లో కనిపించడం కలకలం సృష్టించింది. సోమవారం నుంచి కనిపింకుండా పోయిన విపిన్ జోషి కోసం వెతికిన పోలీసులకు అతడిని క్లోజ్ ఫ్రెండ్సే హత్య చేసినట్టు గుర్తించారు. మృతదేహాన్ని ముక్కలు చేసిన ఇద్దరిలో ఒకరిని అరెస్ట్ చేశారు. 

29 ఏళ్ల విపిన్ జోషి బార్ టెండర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి అతడు కనిపించకుండా పోవడంతో పోలీసులు గాలిస్తున్నారు.. శనివారం సైదులాజాబ్ లోని ఒక ఇంటి నుంచి దుర్గంధం వస్తోందని సమాచారం రావడంతో వెళ్లారు. ఇంట్లో సగం మూసి ఉన్న ఫ్రిజ్ తీసి చూసిన పోలీసులకు అందులో మృతదేహం భాగాలు బయటపడ్డాయి. వాటిని విపిన్ జోషిగా గుర్తించిన పోలీసులు అతడి ఫ్రెండ్ చిన్మయ్ బిస్వాల్‌ను అరెస్ట్ చేశారు. మరో ఫ్రెండ్ బాదల్ మండల్ కోసం గాలిస్తున్నారు.

ముగ్గురూ ఒకే బార్‌లో పనిచేస్తారు. సైదులాజాబ్ లో వేరు వేరు ఇళ్లలో నివసిస్తారు. మండల్‌తో కలిసి జోషిని చంపినట్టు బిస్వాల్ ఒప్పుకున్నాడు. హత్యకు కారణం ఏంటనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు ఉపయోగించిన ఆయుధం కూడా ఇంకా దొరకలేదు. ఘటనాస్థలంలో మద్యం బాటిల్స్, రక్తపు మరకలున్న బట్టలు స్వాధీనం చేసుకున్నారు. రెస్టారెంట్ సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com