యూఏఈ డ్రైవర్ బాబు రోడ్లపై సాహసకృత్యాలు : మురికిగుంతలో ఇరుక్కొన్న కారు
- October 15, 2017
అబుదాబి: ' సినిమాలు చూసి... ఫైటింగ్ లు చేస్తే ...నడుములు ఎలా జారుతాయో ? కార్లను స్టంట్ మూవీలో ఉరికించినట్లు నడిపితే అబూ ధాబీ ట్రాఫిక్ పోలీసులు పట్టుకొని తగిన రీతిలో సత్కరిస్తారు. ప్రయాణికులను తరలించే వాహన డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో పెట్రోల్ డైరెక్టరేట్ పోలీసులు యూఏఈ డ్రైవర్ బాబు సాహసకృత్యాలు ప్రత్యేకంగా పరిశీలించేందుకు తమ అదుపులోనికి తీసుకొన్నారు. ఆ డ్రైవర్ తన వాహనంను అడ్డదిడ్డంగా నడిపి బానియస్ ప్రాంతంలోని ఒక మురికిగుంతలో అమాంతంగా ఇరికించాడు. ఆ ప్రయాణికులను ఒక చోట నుంచి మరొక చోటుకి తరలించే ఆ వాహనంతో ఉన్న ఇద్దరు ప్రయాణీకులు సైతం అదుపులోకి పోలీసులు తీసుకున్నారు.ఈ సందర్బంగా అబూ ధాబి ట్రాఫిక్ మరియు పెట్రోల్ డైరెక్టరేట్ డిప్యూటీ డైరెక్టర్ లెఫ్ట్నెంట్ కల్నల్ అబ్దుల్లా అల్ సువాయిడ్ మాట్లాడుతూ, ఈ కేసులో డ్రైవర్ మరియు అతనితో పాటు ఉన్న ఇద్దరు వ్యక్తులను సైతం అరెస్టు చేశారు. డ్రైవర్ వద్ద నుంచి ఆ వాహనం స్వాధీనం చేసుకున్నారు.ఆ డ్రైవర్ విపరీతమైన వేగంతో స్టంట్ చిత్రంలో కారుని నడిపినట్లు దీంతో ఆ వ్వ్యక్తి మోటార్ వాహన చట్టాన్ని ఉల్లంఘించినట్ ఆ అధికారి తెలిపారు. ఈ విధంగా నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే డ్రైవర్ల తీరుని పసిగట్టేదుకు నిఘా కెమెరాలు పలుచోట్ల ఏర్పాటుచేసినట్లు ఆయన చెప్పారు. 2017 నాటి ఆర్టికల్ సంఖ్య 178 ప్రకారం నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్న వాహనకారుడు 2,000 దిర్హామ్ జరిమానాతో పటు 23 బ్లాక్ పాయింట్లు మరియు అతని వాహనంను రెండు నెలల కాలం పాటు స్వాధీనం చేసుకోనున్నట్లు ఆయన తెలిపారు.అదేవిధంగా నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే పిల్లల కార్యకలాపాలను పర్యవేక్షించాలని వారి ఆయన తల్లిదండ్రులు కోరారు
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?
- 2025లో ఖతార్ లో 3% పెరిగిన ప్యాసింజర్స్..!!







