కువైట్ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం
- October 15, 2017
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పర్సనల్ ఆరుగురు సభ్యుల డ్రగ్స్ ముఠాని అరెస్ట్ చేసింది. వారి నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స యాంఫిటమైన్ పిల్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. 2 మిలియన్లకు పైగా కాప్టగాన్ పిల్స్‌ని స్మగ్లింగ్ చేసే యత్నాన్ని భగ్నం చేయడం జరిగిందని మినిస్ట్రీకి చెందిన ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఓ ప్రకటనలో పేర్కొంది. యాంటీ నార్కోటిక్స్ జనరల్ డైరెక్టరేట్, ఈ స్మగ్లింగ్ యత్నాన్ని భగ్నం చేసినట్లు ఆ ప్రకటనలో వెల్లడించారు. వివిధ దేశాలకు చెందినవారి సహకారంతో ఓ వ్యక్తి విమానయానం ద్వారా డ్రగ్స్‌ని స్మగుల్ చేస్తున్నట్లు సమాచారం అందడంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి, ఆ యత్నాన్ని భగ్నం చేయడం జరిగింది. విచారణలో నిందితుడు మరో స్మగ్లింగ్ యత్నం గురించి సమాచారం అందించడంతో, ఇద్దరు సిటిజన్స్‌ని అరెస్ట్ చేశారు. ఇందులో కస్టమ్స్ డిపార్ట్మెంట్కి చెందిన ఓ వ్యక్తి కూడా ఉన్నట్లు తెలియవస్తోంది. 300 కాప్టగాన్ పిల్స్‌ని వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







