కుటుంబాన్ని కలిపిన దుబాయ్‌ పోలీసులు

- October 15, 2017 , by Maagulf
కుటుంబాన్ని కలిపిన దుబాయ్‌ పోలీసులు

దుబాయ్‌ పోలీసులు, ఓ విడిపోయిన కుటుంబం కలవడంలో తోడ్పాటునందించారు. ఓ కుటుంబం, తమ కుమారుడ్ని ఆరేళ్ళపాటు కోల్పోగా, అతన్ని ఆ కుటుంబంతో కలిపారు పోలీసులు. దుబాయ్‌ పోలీస్‌ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ మేజర్‌ జనరల్‌ అబ్దుల్లా అల్‌ మర్రి మాట్లాడుతూ, కేట్‌ ఓ హాలోరాన్‌, తమ కుమారుడు గెరాడ్‌ విషయమై దుబాయ్‌ పోలీసులకు సమాచారమిచ్చారు. తప్పిపోయిన తమ కొడుకుని అందించాల్సిందిగా యూకేకి చెందిన కేట్‌ ఓ హాలోరాన్‌ పోలీసుల్ని సంప్రదించారు. పలు ఉద్యోగాలు మారుతూ వచ్చిన ఐరిష్‌ మ్యాన్‌ తమ కుటుంబంతో కాంటాక్ట్‌ కోల్పోయినట్లు పోలీసులు గుర్తించారు. జబెల్‌ అలిలో ఆ వ్యక్తి ఉంటున్నట్లు కనుగొన్న పోలీసులు, అతని ఇంట్లోకి వెళ్ళి చూడగా, అన్‌కాన్షియస్‌ స్టేజ్‌లో తీవ్రంగా గాయపడిన పరిస్థితుల్లో ఉన్న అతన్ని రషీద్‌ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఓ హాలోరన్‌కి సమాచారమిచ్చారు. తమ కుమారుడ్ని తమకు అప్పగించినందుకు పోలీసులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com