విశాఖలో ఐఎన్‌ఎస్‌ కిల్టన్‌ జాతికి అంకితం

- October 16, 2017 , by Maagulf
విశాఖలో ఐఎన్‌ఎస్‌ కిల్టన్‌ జాతికి అంకితం

దేశీయ పరిజ్ఞానంతో నిర్మించిన యాంటీ సబ్‌మెరైన్‌ వార్‌ షిప్‌ ఐఎన్‌ఎస్‌ కిల్టన్‌ను రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ జాతికి అంకితం చేశారు. సోమవారం ఉదయం ఆమె విశాఖలోని తూర్పు నౌకాదళ స్థావరానికి చేరుకున్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆమె ఐఎన్‌ఎస్‌ కిల్టన్‌ను జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో నావికాదళ చీఫ్‌ అడ్మిరల్‌ సునీల్‌ లంబ, తూర్పు నావికా దళాధిపతి హెచ్‌సీఎస్‌ బిస్త్‌ పాల్గొన్నారు.
ఐఎన్‌ఎస్‌ కిల్టన్‌ను కార్బన్‌ ఫైబర్‌, మిశ్రమ లోహాలతో తయారు చేశారు. దీంతో ఈ కార్వెట్‌ ప్రయాణాన్ని శత్రుదేశ నిఘా వ్యవస్థలు గుర్తించలేవు. 'ప్రాజెక్ట్‌ 28' కింద నిర్మిస్తున్న నాలుగు కార్వెట్‌లలో ఇది మూడోది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com