రస్ అల్ ఖైమా నివాసితులకు సీవేజ్ బిల్
- October 16, 2017
రస్ అల్ ఖైమా: రస్ అల్ ఖైమా నివాసితులు, వచ్చే ఏడాది నుంచి సీవేజ్ బిల్లు చెల్లించాల్సి ఉంటుందని సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి. నీటి వినియోగానికి అదనంగా 50 శాతం బిల్లుని సీవేజ్కి చెల్లించాల్సి ఉంటుంది వినియోగదారులు. ఫెడరల్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (ఫెవా) బిల్లుతోపాటే సీవేజ్ బిల్లు కూడా వస్తుందని అధికారులు వివరించారు. ఎమిరేట్ వ్యాప్తంగా 85,000 మంది ఫెవా పరిధిలో ఉండగా, 20,000 ఇళ్ళు సీవేజ్ నెట్వర్క్కి కనెక్ట్ అయి ఉన్నాయి. మవైరిద్ ప్రాంతాన్ని కనెక్ట్ చేసేందుకు ఫెవా, గత ఆగస్ట్‌లో పనులు ప్రారంభించింది. జూన్ 2018 నాటికి 564 ప్లాట్లు సీవేజ్ నెట్‌వర్క్‌తో కనెక్ట్ అవుతాయి. కొత్త సీవేజ్ సిస్టమ్, పాత ఇబ్బందికర పరిస్థితుల నుంచి గట్టెక్కిస్తుంది. సీవేజ్ డిపార్ట్మెంట్, 65 మిలియన్ దిర్హామ్‌లతో ఫిల్యా సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ని నిర్మిస్తోంది. నవంబర్‌లో ఈ ప్రాజెక్ట్ పూర్తి కానుంది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







