పోర్చుగల్లో ఉత్తర, మధ్య ప్రాంతాల్లో కార్చిచ్చు.. 27 మంది ఆహుతి
- October 16, 2017
ఐరోపా కూటమిలోని దేశాలైన పోర్చుగల్, స్పెయిన్ల్లోని అడవుల్లో ఆదివారం మంటలు చెలరేగి మొత్తం 30 మంది సజీవ దహనమయ్యారు. పోర్చుగల్లోని ఉత్తర, మధ్య ప్రాంతాల్లో ఎగసిపడిన అగ్నికీలల ధాటికి 27 మంది మరణించారు. 20 చోట్ల కార్చిచ్చు ఇంకా విజృంభిస్తుండటంతో అత్యవసర స్థితిని విధిస్తున్నట్లు ఆ దేశ ప్రధాన మంత్రి ఆంటోనియో కోస్టా సోమవారం ప్రకటించారు. 4 వేల మందికి పైగా అగ్నిమాపక దళ సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు, కరువు పరిస్థితులే పోర్చుగల్లో మంటలు ఇంతలా ఎగసిపడటానికి కారణమనీ, ఆదివారం మొత్తంగా 520 చోట్ల అడవుల్లో నిప్పు రాజుకుందని అధికారులు తెలిపారు. ‘మాకు నరకం చాలా దగ్గరగా కనిపించింది. ఎక్కడ చూసినా భయంకరంగా మంటలు ఎగసిపడుతున్నాయి’ అని పెనకోవ పట్టణానికి చెందిన ఓ మహిళ వాపోయారు. ఆమె ఇద్దరు సోదరులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తూ మృత్యువాతపడ్డారు.
తాజా వార్తలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం









