దుబాయ్ మాల్స్ ఎంట్రన్స్‌లలో ఇ-సిగరెట్స్ నిషేధం
- October 17, 2017
దుబాయ్‌లోని షాపింగ్ సెంటర్స్, మాల్స్‌లలో ఇ-సిగరెట్లను వినియోగించడం నిషేధం. పబ్లిక్ ప్లేస్‌లు, షాపింగ్ మాల్స్‌లలో ఎలక్ట్రానిక్ సిగరెట్స్‌ని వినియోగించడాన్ని దుబాయ్ మునిసిపాలిటీ నిషేధించింది. ఈ నేపథ్యంలో మాల్స్ నిర్వాహకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయగా, మాల్స్ యాజమాన్యం తమ సిబ్బందిని అప్రమత్తం చేసింది. కొన్ని షాపింగ్ మాల్స్ నిబంధనల్ని ఉల్లంఘించి, తమ వినియోగదారులకు మాల్స్లోపల స్మోకింగ్ జోన్స్ ఏర్పాటు చేసినట్లుగా తమ దృష్టికి రావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మునిసిపాలిటీ అధికారులు వెల్లడించారు. మునిసిపాలిటీకి చెందిన పబ్లిక్ హెల్త్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ రెధా సల్మాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. 2099లో పబ్లిక్ ప్లేసెస్‌లో స్మోకింగ్‌ని బ్యాన్ చేయడం జరిగింది. ఇ-సిగరెట్లకూ ఇది వర్తిస్తుంది. పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్ చేస్తే 1,000 దిర్హామ్‌ల వరకు జరీమానా విధించబడ్తుంది.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







