సైనికులతో దీపావళి జరుపుకోనున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- October 17, 2017
కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సైనికులతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకోనున్నారు. రెండురోజుల పాటు నిర్మలా సీతారామన్ అండమాన్ నికోబార్ దీవుల్లో పర్యటించనున్నారు.సైనికులతో కలిసి ఆమె దీపావళి వేడుకల్లో పాల్గొంటారని రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది.
బుధవారం నుంచి అండమాన్ నికోబార్ దీవుల్లోని త్రివిధ దళాల కమాండ్‌లో ఆమె పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు సీతారామన్ అక్కడ పర్యటిస్తారు. భద్రత తదితర విషయాలపై ఆమె అక్కడి అధికారులతో చర్చలు జరపనున్నారు.
సైనికులతో కలిసి రక్షణశాఖ మంత్రి సీతారామన్ దీపావళి వేడుకలు జరుపుకుంటారు. దీంతో పాటు సైనికుల కుటుంబాలతో కలిసి నిర్వహించే పలు కార్యక్రమాల్లోను ఆమె పాల్గొంటారని రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది.
ఈ పర్యటనలో భాగంగా సెల్యులర్ జైలులో ఉన్న స్వతంత్ర జ్యోతి, కార్ నికోబార్‌లో ఉన్న సునామీ మెమోరియల్‌ను ఆమె సందర్శించనున్నారు. దీంతో పాటు కార్ నికోబార్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌ను ఆమె సందర్శిస్తారు. అండమాన్ నికోబార్ కమాండ్ భారత్‌లో ఉన్న ఏకైక త్రివిధ దళాల కమాండ్.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







