వర్థమాన గాయని హర్షిత దహియా దారుణ హత్య
- October 18, 2017
హర్యానా గాయని హర్షిత దహియా (22) దారుణ హత్యకు గురయ్యారు. పానిపట్‌లోని ఇస్రానాలో ఆమెపై దుండగులు కాల్పులు జరిపి, హత్య చేశారు. ఇస్రానాలో మంగళవారం ప్రదర్శన ఇచ్చిన అనంతరం తిరిగి ఢిల్లీలోని తన ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఆమె ఢిల్లీలోని నరేలాలో నివసిస్తున్నారు.
ఈ సంఘటనపై పోలీసు అధికారి ఒకరు విలేకర్లతో మాట్లాడుతూ హర్షిత ఇస్రానాలో ప్రదర్శన అనంతరం కారులో ఢిల్లీ వెళ్తూండగా నలుగురు దుండగులు దాడి చేశారని చెప్పారు. వీరు పానిపట్‌లోని చమ్రారా గ్రామం వద్ద మరొక కారులో వచ్చారని, ఆమె కారును ఓవర్టేక్ చేసి, కాల్పులు జరిపారని చెప్పారు. ఆమె అక్కడికక్కడే మృతి చెందారని తెలిపారు. పానిపట్‌లోని ఆసుపత్రిలో ఆమె మృతదేహాన్ని ఉంచినట్లు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









