దేశరాజధానిలో 1200 కిలోల టపాసులు సీజ్ చేసిన పోలీసులు
- October 18, 2017
దేశరాజధానిలో బాణసంచా అమ్మకాలకు పాల్పడుతున్న 29 మంది వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 1200 కిలోల టపాలసులను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ సహా దేశరాజధాని పరిథిలో దీపావళి సందర్భంగా టపాసులు విక్రయించకూడదంటూ సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ పోలీసు అధికారి మధుర్ వర్మ మీడియాతో మాట్లాడుతూ.. ''సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నవంబర్ 1 వరకు ఢిల్లీలో బాణసంచా అమ్మకాలకు అనుమతి లేదు. అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా పలుచోట్ల టపాసులు అమ్ముతున్న 29 మందిని అరెస్టు చేశాం. 1200 కిలోల మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాం. మంగళవారం అనేక బాణసంచా షాపులను మూసేవేయించాం...'' అని వెల్లడించారు. కాగా తాజా పరిణామాల నేపథ్యంలో మంగళవారం నుంచి వ్యాపారులు ఆన్‌లైన్‌లో కూడా బాణసంచా అమ్మకాలు నిలిపివేశారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







