డిసెంబర్ లో రిలీజ్ కానున్న సల్మాన్ 'టైగర్‌'

- October 18, 2017 , by Maagulf
డిసెంబర్ లో రిలీజ్ కానున్న సల్మాన్ 'టైగర్‌'

సల్లూభాయ్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'టైగర్‌ జిందా హై' ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది. దీపావళి సందర్భంగా సల్మాన్‌ లుక్‌ని ట్విటర్‌ ద్వారా విడుదలచేశాడు. ఇందులో సల్మాన్‌ గన్ను పట్టుకుని కోపంగా చూస్తున్న స్టిల్‌ సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది.
ఫస్ట్‌లుక్‌పై 'దెబ్బతగిలిన పులిలా ఎవ్వరూ వేటాడలేరు' అని రాసున్న డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి అలీ అబ్బాస్‌ జఫర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. యశ్‌రాజ్‌ ఫిలింస్‌ నిర్మిస్తోంది. ఇందులో భాయ్‌కి జోడీగా కత్రినా కైఫ్‌ నటిస్తోంది. 2012లో వచ్చిన 'ఎక్‌ థా టైగర్‌'కి ఈ చిత్రం సీక్వెల్‌గా రాబోతోంది. క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్‌ 22న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఈ సినిమా ఆఖరి షెడ్యూల్‌ కోసం సల్మాన్‌, కత్రినా గ్రీస్‌ వెళ్లనున్నారు. ఈ ఏడాది 'ట్యూబ్‌లైట్‌' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సల్మాన్‌కి నిరాశే మిగిలింది. మరోపక్క కత్రినాకి కూడా 'జగ్గా జాసూస్‌' చిత్రం విజయం అందించలేదు. దాంతో వీరిద్దరూ ఈ సినిమాపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com