మగధీర ను మర్చిపోయి షాక్ ఇచ్చిన కాజల్

- October 18, 2017 , by Maagulf
మగధీర ను మర్చిపోయి షాక్ ఇచ్చిన కాజల్

హీరోయిన్ గా థర్టీ ప్లస్ లోపడి కెరీర్ కంటిన్యూ చేయడం ఆషామాషీ కాదు. సౌత్ లో ఈ లిస్ట్ లో ఉన్న కాజల్ అగర్వాల్ ఈ ఇయర్ తెలుగులో ఖైదీ నెం 150, నేనే రాజు లతో మళ్ళీ ఫామ్ అందుకుంది. టెంపర్ మూవీ తర్వాత ఇక కాజల్ కష్టమే అని గాసిప్స్ వచ్చినా తెలుగు తమిళ్ ల్లో బానే సెట్ అయింది.
ఇక అసలు విషయానికొస్తే అదిరింది అనే డబ్ మూవీ తో మళ్ళీ ఆడియన్స్ ముందుకొస్తున్న కాజల్ ఓ ఇంటర్యూ లో తన కెరీర్ బెస్ట్ "వివేకం" అని చెప్పి షాక్ ఇచ్చిందట. అజిత్ హీరోగా వచ్చి ప్లాప్ అయిన ఈ మూవీలో తన రోల్ కు ఎలాంటి ఇంపార్టెన్స్ లేకున్నా కాజల్ ఎందుకలా చెప్పిందో సస్పెన్స్ అని టాక్. తెలుగులో తన బెస్ట్ ఫిల్మ్స్.. మిస్టర్ పెర్ఫెక్ట్, బాద్ షా, నేనేరాజు నేనేమంత్రి అనేసి మగధీర ను మర్చిపోయిందని కామెంట్స్ వస్తున్నాయ్. తెలుగులో కాజల్ ఇపుడు కళ్యాణ్ రామ్ జోడీగా ఎం ఎల్ ఏ మూవీ చేస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com