అయోధ్యలో 2 లక్షల దీపాలతో దీపావళి సంబరాలు.!
- October 18, 2017
యూపీలో దీపావళి వేడుకలు అంబరాన్నంటాయి. అయోధ్యలో నిర్వహించిన భారీ దీపోత్సవంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తోపాటు దాదాపు 2వేల మంది స్కూల్ విద్యార్థినులు పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా రెండు లక్షల దీపాలను వెలిగించారు. ఇందులో లక్షా 71 వేల దీపాలను సరయూ నది ఒడ్డున ఏర్పాటు చేశారు. రామజన్మభూమి అయోధ్యను ప్రపంచవ్యాప్తంగా పాపులర్ చేయడంలో భాగంగా.. గిన్నీస్ రికార్డ్ కోసం సీఎం ఈ దీపోత్సవాన్ని ప్లాన్ చేశారు. గతంలో ఈ రికార్డ్ గుర్మీత్ బాబాకు చెందిన డేరా ఆశ్రమం పేరిట ఉంది. గత ఏడాది లక్షా 50వేల దీపాలను డేరా అనుచరులు వెలిగించారు. దీపాలను పరిశీలించిన తర్వాత ఈ రికార్డ్ పై గిన్నీస్ ప్రతినిధులు ప్రకటన చేయనున్నారు. అయోధ్య మానవత్వానికి మాతృభూమి అని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. రామరాజ్యం ద్వారానే ప్రపంచానికి మానవత్వాన్ని చాటి చెప్పిన చరిత్ర మనదని అన్నారు. దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన యోగి సర్కార్.. రామాయణం నాటి ఘట్టాన్ని ప్రతిబింబించేలా.. సీతా రామలక్షణులను అయోధ్యకు తీసుకువచ్చింది. అప్పట్లో రావణాసుర వధ అనంతరం రాముడు, సీత, లక్ష్మణుడు పుష్పక విమానంలో అయోధ్యకు వచ్చారు. ఇప్పుడు.. పుష్పక విమానం లేకపోవడంతో.. హెలికాప్టర్లో సీతా రామ లక్ష్మణ పాత్రధారులను అయోధ్యకు తీసుకువచ్చారు. హెలికాప్టర్లో నుంచి దిగిన సీతారామలక్ష్మణులకు సాదర స్వాగతం పలికారు సీఎం ఆదిత్యనాథ్. అనంతరం వేదికపైకి తీసుకు వెళ్లి ఘనంగా సన్మానించారు. ఆనాటి సీతారాములను తలపించిన ఈనాటి సీతారాములను చూసి మురిసిపోయారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్‌కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్‌డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









