రచయిత జార్జ్‌ సాండర్స్‌కు బుకర్‌ ప్రైజ్‌.!

- October 18, 2017 , by Maagulf
రచయిత జార్జ్‌ సాండర్స్‌కు బుకర్‌ ప్రైజ్‌.!

బ్రిటన్‌కు చెందిన ప్రతిష్టాత్మక మాన్‌బుకర్‌ ప్రైజ్‌ను అమెరికా రచయిత జార్జ్‌ సాండర్స్‌ గెలుచుకున్నారు. సాండర్స్‌ రచించిన ''లింకన్‌ ఇన్‌ ది బార్డో'' నవలకు బుకర్‌ ప్రైజ్‌ లభించింది. ఈ ప్రైజ్‌ను గెలుచుకున్న అమెరికన్‌ రచయితలలో సాండర్స్‌ రెండో వారు. అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్‌ కుమారుడు పదకొండేళ్ళ విల్లీ మరణానికి సంబంధించి సాండర్స్‌ రచించిన ''లింకన్‌ ఇన్‌ ది బార్డో'' నవల అత్యంత వాస్తవికంగా ఉందని బుకర్‌ ప్రైజ్‌ న్యాయ నిర్ణేతల కమిటీ పేర్కొంది. విల్లీ మరణానికి సంబంధించి వందలాది మంది నుంచి సేకరించిన సమాచారాన్ని నవలగా మలిచిన తీరు ప్రశంసనీయమని న్యాయ నిర్ణేతల కమిటీ వెల్లడించింది. ఈ సందర్భంగా రచయిత సాండర్స్‌ (58) మాట్లాడుతూ ఇది తనకు దక్కిన గొప్ప గౌరవంగా పేర్కొన్నారు. ఈ ఏడాది మాన్‌ బుకర్‌ ప్రైజ్‌కు ముగ్గురు అమెరికా రచయితలు, ముగ్గురు బ్రిటన్‌ రచయితలు పోటీ పడ్డారు. మొత్తం ఆరుగురిలో జార్జ్‌ సాండర్స్‌ అవార్డు గెలుచుకున్నారు. కామన్వెల్త్‌ దేశాల రచయితలను ప్రోత్సహించేందుకు 1969లో ఈ అవార్డును ప్రోత్సహించారు.

ఆ తరువాత 2014 సంవత్సరంలో ఇంగ్లీషు మాట్లాడే దేశాల రచయితలను కూడా అవార్డుకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా పేర్కొన్నారు. గత ఏడాది రచయిత పాల్‌ బీటి ఈ అవార్డును గెలుచుకున్నారు. బీటి రచించిన ''ది సెల్లవుట్‌'' నవలకు అవార్డు లభించింది. పాల్‌ బీటి బుకర్‌ ప్రైజ్‌ అందుకున్న తొలి అమెరికా రచయిత.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com