పాకిస్థానీలకు సుష్మా దీపావళి కానుక.!
- October 19, 2017
భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పాకిస్థానీయులకు దీపావళి కానుకను ఇచ్చారు. భారత్‌లో వైద్య చికిత్స నిమిత్తం మెడికల్ వీసాలను దరఖాస్తు చేసుకున్న వారందరికీ వీసాలు మంజూరు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. పెండింగ్‌లో ఉన్న మెడికల్ వీసాల దరఖాస్తుదారులందరికీ వీసాలను మంజూరు చేస్తున్నట్లు సుష్మాస్వరాజ్ గురువారం ట్విటర్లో వెల్లడించారు. పాకిస్థాన్‌కు చెందిన అమ్నా షమీన్ ఢి ల్లీలో చికిత్స పొందుతున్న తన తండ్రిని చూసేందుకు అనుమతి కోరుతూ సుష్మా సాయాన్ని కోరింది. అందుకు స్పందించిన ఆమె పాక్‌లోని భారత దౌత్య కార్యాలయ అధికారులను కలవాల్సిందిగా సూచించారు.
పాక్‌కు చెందిన మరో చిన్నారి వైద్య చికిత్స నిమిత్తం పాప తండ్రి మెడికల్ వీసా కోరుతూ సుష్మాను ఆశ్రయించారు. మరో పాకిస్థానీయురాలు భారత్‌లో కాలేయ శస్త్రచికిత్స చేయించుకునేందుకు వీసా దరఖాస్తు చేసుకున్నారు. పాక్ వాసి నజీర్ అహ్మద్ తన ఎనిమిదేళ్ల కూతురికి భారత్‌లో చికిత్స చేయించేందుకు వీసా కోరుతూ సుష్మా స్వరాజ్‌కు ట్వీట్ చేశారు. వీటన్నింటిపైనా సానుకూలంగా స్పందించిన సుష్మా అందరికీ వీసాలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







