భారతీయ శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యన్ కు గూగుల్‌ గౌరవం

- October 19, 2017 , by Maagulf

నోబెల్‌ బహుమతి పొందిన భారతదేశ ఖగోళ భౌతికశాస్త్రవేత్త సుబ్రహ్మణ్యన్‌ చంద్రశేఖర్‌ 107 జయంతిని పురస్కరించుకుని గూగుల్‌ డూడుల్‌ పెట్టింది. నక్షత్రాల పరిణామ సిద్ధాంతాన్ని కనుగొన్నందుకుగాను ఆయన నోబెల్‌ బహుమతిని అందుకున్నారు. ఈ ఇండో-అమెరికన్‌ ఖగోళ భౌతికశాస్త్రవేత్త నక్షత్రాల్లోనూ పరిణామదశ ఉందన్న అంశాన్ని కనుగొన్నారు. ప్రస్తుతం పాకిస్థాన్‌లో లాహోర్‌లో 1910 అక్టోబర్‌ 19న ఓ తమిళ కుటుంబంలో జన్మించారు. ప్రముఖ భౌతిక శాస్తవేత్త సీవీ రామన్‌కు ఈయన మేనల్లుడు.

మద్రాస్‌ ప్రెసిడెన్సీ కళాశాలలో, అమెరికా వెళ్లే వరకు కేంబ్రిడ్జి యూనివర్సిటీ(1936)లో చదివారు. అనంతరం చికాగో యూనివర్సిటీలో అధ్యాపకుడిగా పనిచేశారు. నక్షత్రాల పరిణామ సిద్ధాంతాన్ని కనుగొన్నందుకు గాను 1983లో ఆయన్ను నోబెల్‌ బహుమతికి ఎంపిక చేశారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో పరిశోధకుడిగా వ్యవహరిస్తున్న కాలంలో 'చంద్రశేఖర్‌ లిమిట్‌'గా పిలిచే తన సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు. నక్షత్రాలు అస్థిరత్వం కావని, వాటికవే నష్టపోయి తెల్లని మరుగుజ్జులుగా మారుతాయని తన పరిశోధనల్లో పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com