దహీ కె కబాబ్
- October 20, 2017
కావల్సినవి: గడ్డ పెరుగు - ఒకటిన్నర కప్పు, కొత్తిమీర కట్ట - ఒకటి, ధనియాలు - అరచెంచా, సెనగపిండి - టేబుల్‌స్పూను, మ్యుసెలీ లేదా కార్న్‌ఫ్లేక్స్ - పావుకప్పు, జీలకర్రపొడి - అరచెంచా, యాలకులపొడి - అరచెంచా, ఉప్పు - తగినంత, నూనె - వేయించేందుకు సరిపడా, ఉల్లిపాయ - ఒకటి, వెనిగర్ - చెంచా, చిక్కని పెరుగు - అరకప్పు, మిరియాలపొడి - కొద్దిగా.
తయారీ: పెరుగును ఓ గిన్నెలోకి తీసుకుని అందులో ధనియాలపొడీ, సెనగపిండీ, జీలకర్రపొడీ, వెనిగర్, కొత్తిమీర తరుగూ, యాలకులపొడీ, తగినంత ఉప్పూ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న పట్టీల్లా చేసుకుని తరవాత మ్యూసెలీ లేదా కార్న్‌ఫ్లేక్స్‌లో అద్దాలి. వీటిని కాగుతోన్న నూనెలో వేసి వేయించుకుని తీసుకోవాలి. దీన్ని ఉల్లిపాయముక్కలు, మిరియాలపొడీ, ఉప్పు వేసిన పెరుగుతో కలిపి వడ్డించాలి.
తాజా వార్తలు
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత







