ఉగ్రదాడులన్నీ మానవ హక్కుల ఉల్లంఘనలే అంటున్న న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌

- October 20, 2017 , by Maagulf
ఉగ్రదాడులన్నీ మానవ హక్కుల ఉల్లంఘనలే అంటున్న న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌

ఉగ్రవాదులు జరిపే దాడుల్లో తీవ్రంగా నష్టపోయేది బాధితులేనని, వారి మానవ హక్కులకు కలుగుతున్న ఘోర ఉల్లంఘనలపై అంతర్జాతీయ వేదికల్లో ఎందుకు చర్చ జరగటంలేదని భారత న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ప్రశ్నించారు. ఉగ్రవాదులు, కరడు గట్టిన నేరస్థుల మానవ హక్కులకు భంగం కలుగుతుందనే వాదనలకే ప్రాధాన్యం లభిస్తుండటంలోని ఔచిత్యం ఏమిటని నిలదీశారు. ఉగ్రవాదం వల్ల భారత దేశం తీవ్రంగా నష్టపోతోందన్నారు. బహమాస్‌లో జరిగిన కామన్వెల్త్‌ దేశాల న్యాయశాఖ మంత్రుల సదస్సులో రవిశంకర్‌ ప్రసాద్‌ మాట్లాడారు. అనంతరం సదస్సులో ''ఉగ్రవాదం సమర్థనీయం కాదు. ఉగ్ర చర్యలన్నీ బాధితుల మానవ హక్కులకు తీవ్ర ఉల్లంఘనలే'' అనే తీర్మానం ఆమోదం పొందింది. కామన్వెల్త్‌ దేశాల సదస్సులో ఈ తరహా తీర్మానం చేయటం ఇదే ప్రథమమని కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు దేశాలన్నీ కలసికట్టుగా పోరాడాల్సిన అవసరాన్ని సదస్సులో రవిశంకర్‌ ప్రసాద్‌ వివరించారని ఆ ప్రకటన వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com