నవంబర్ 17న రానున్న కార్తి నటించిన 'ఖాకీ'
- October 21, 2017తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ సొంతం చేసుకున్న దక్షిణాది హీరో కార్తి. సూర్య తమ్ముడిగా తెరంగేట్రం చేసిన కార్తి తరువాత తనదైన స్టైల్ లో ఆకట్టుకుంటున్నాడు. లవర్ బాయ్ ఇమేజ్ తో పాటు యాక్షన్ హీరోగానూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కార్తి హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ఖాకీ త్వరలో రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఇప్పటికే పోలీస్ పాత్రల్లో ఆకట్టుకున్న కార్తి మరోసారి పోలీస్ గెటప్ లో అలరించనున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు వినోద్ దర్శకుడు. జిబ్రాన్ సంగీతమందించారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను నవంబర్ 17న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ