భారతదేశ రాష్ట్రపతి భద్రతకు రూ.150కోట్లు
- October 21, 2017
భారతదేశ ప్రథమ పౌరుడి భద్రతా సిబ్బందికి నాలుగేళ్లలో రూ.155.4కోట్లు జీతంగా ఇచ్చినట్లు రాష్ట్రపతి భవన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వెల్లడించారు. లఖ్‌నవూకి చెందిన సామాజిక కార్యకర్త న్యూటన్ ఠాకూర్ ఆర్టీఐ(సహచట్టం) కింద అడిగిన ప్రశ్నకు బదులుగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. 2014-15 సంవత్సరానికిగాను రాష్ట్రపతి భద్రతా సిబ్బందికి రూ.38.17కోట్లు జీతంగా ఇచ్చినట్లు పేర్కొన్నారు. 2015-16లో రూ.41.77కోట్లు, 2016-17లో రూ.48.35కోట్లు, 2017-18లో రూ.27.11కోట్లు జీతాలుగా చెల్లించారు.ఈ నాలుగేళ్లలో భద్రతా సిబ్బంది ఉపయోగించే వాహనాల నిర్వహణ కోసం రూ.64.9లక్షలు ఖర్చు పెట్టారు. 2014-15లో రూ.15.5లక్షలు, 2015-16లో రూ.20లక్షలు, 2016-17లో రూ.21.8లక్షలు, 2017-18లో రూ.7.5లక్షలు వెచ్చించారు. అయితే.. ప్రభుత్వ పెట్రోల్ బంకుల నుంచే ఇంధనాన్ని ఉపయోగించినందు వల్ల ఈ వ్యయంలో వాహన ఇంధనాలకు అయిన ఖర్చును మాత్రం కలపలేదు. ఎంత మంది భద్రతా సిబ్బంది ఉంటారు, ఎన్ని ప్రభుత్వ వాహనాలను ఉపయోగిస్తున్నారనే ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు రాష్ట్రపతి భవన్ డీసీపీ నిరాకరించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆ వివరాలను వెల్లడించలేమని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







