మదిని మీటిన వర్షం-పార్ట్-2

- November 05, 2015 , by Maagulf

తను వచ్చి ఇదే చాప మీద కూర్చోవాలని ఆశగా చూస్తున్న అనుకునట్టుగానే వచ్చి ఒక మూలకి వచ్చి కూర్చుంది చాప పైన. మనసు పిల్లాడికి పీచు మిఠాయి దొరికినట్టు ఆనందంతో ఉరకలేస్తోంది ఆత్మ రాముడు "లడ్డు కావాలా నైన అని అడిగాడు", "పాలకోవా లాంటి అమ్మాయి జామూన్ లాగ ఎదురు కూర్చుంటే లడ్డు ఎందుకు బే" అని కసురుకొన్నా .. ఏమైన చేసి అమ్మాయితో మాట్లాడాలి అమ్మాయిని ఇంప్రెస్స్ చేసి పడేయాలి అని కాని ఎలా ?? మా మగాళ్ళు మహా కేటుగాల్లు ధైర్యవంతులు అనుకుంటాం కాని అమ్మాయి ఒంటిరిగా వచ్చి ఎదురుగా ఉంటె ఎలా ఇంప్రెస్స్ చేయాలో అర్థం కాక తర్జన భర్జనలు పడతాం …. మనసులో 100HP పవర్ తెచ్చుకొని మాట్లాడుదాం అని నోరు తెరిచే లోపల "మీ ఊరు" అని అడిగింది …. అంటే ఇందాక చెప్పింది అంత గాల్లోకే అన్నమాట ఆత్మ రాముడు అప్పుడే చెప్పాడు సొల్లు వద్దు రా అని … అయిన అడిగింది అమ్మాయి కదా అని మల్లి సొల్లు స్టార్ట్ చేశా పుట్టిన ఊరు, మెట్టిన ఊరు, చస్తున్నఊరు చేస్తున్న పని మల్లి అడగకుండానే చెప్పేసా …. చిన్నగా నవ్వింది పళ్ళు మిల మిల మెరిసాయి నా కళ్ళు జిగేలు మన్నాయి బహుశ హ్యాపీ డెంట్ తింటుంది అనుకుంట… మగాళ్ళ చపలత్వం ఏంటో కాని సొల్లు కారుస్తూ గ్యాప్ ఇవ్వకుండా టకి టకి మని క్వెషన్స్ అడుగుతూ ఉన్న తను ముక్త సరిగా ఒక్కో పదం లో బదులు చెప్పింది ఇంకా ఆపార బాబు అనేట్టుగా ముఖం మాడ్చింది ఏంటో మరి కక్కుర్తి పడి తినట్టు ఉన్న కడుపులో నానా రకాలుగా ఉంది, ఛీ ఛీ ఈ మానవ బాంబులు గోల ఒకటి ఈరోజు అది పక్కన అమ్మాయి ఉనప్పుడు, కొద్దిగా అటు ఇటు అయిన పరువు గోవింద గోవిందా ... ఏమి చేయాలి దేవుడా అని ఆలోచిస్తూ…. బాంబు పేలే ముందు ఒక కూని రాగం తీయడమో లేక పాట పాడితే సరిపోద్ది అనుకోని ఈ తొక్కలో ఐడియా వచ్చినందుకు నన్ను నేను మెచ్చుకుంటూ ఆత్మ రాముడిని చూసా, ఉమ్మేటట్టు చూసాడు…. సడన్ గా “ఈ వర్షం సాక్షిగా తెలపని నువ్వు నాకే సొంతం" అని పాడను తను ఉలిక్కి పడి ఏమయింది అని అడిగింది, ఏమి లేదు అని అడ్డంగా తల ఊపాను …. "ఓరి వీడి వేషాలో రే ఎదవ అమ్మాయి పేరుతో పాట పడుతున్నావు నీకు పోయేకాలం దగ్గర పడింది" అని ఘోష … అప్పుడు కాని అర్థం కాలేదు నేను చేసిన తప్పు ఏంటి అని టక్కున నాలిక్కరుచుకొని సర్దిచెప్పుకొని ఈసారి పాట పాడాల్సి వస్తే రొమాంటిక్ సాంగ్స్ పాడుకుడదు అని డిసైడ్ అయ్యాను …. పొద్దున్న విన్న అన్న గారి పాట జ్ఞాపకం వచ్చింది “పుట్టింటోళ్ళు తరిమేశారు కట్టుకున్నోడు వదిలేసాడు” అని గట్టిగా పాడతున్నఈసారి కొంచం దూరంగా జరిగి "భరత్ గారు ఏమయింది ?? అంత ఓకే కదా" అని అడిగింది ఏమి చెప్పాలో అర్థం కాక తల అటు ఇటు ఊగించి మెల్లగా దించుకున్న తను కూడా అలాగే తల ఊపుతూ బళ్ళున నవ్వేసింది … ఆ అందమైన నవ్వుని అల మైమరచి పోయి చూస్తూ ఉన్న... ఆత్మరాముడు విజిల్స్ వేస్తున్నాడు …. ఒక డ్రీం సాంగ్ వేద్దాం అనుకున్న... నేను చిన్నగా నవ్వుతు గంగిరెద్దు లాగ ఇంకా తల అలాగే ఊపుతూ తనని చూస్తున్న మనసు గాల్లో తేలిపోతోంది …… కొంచం అసహనంగా అలిసిపోయినట్టు ఉంది తను, గుడ్ నైట్ చెప్పి మెల్లగా నిద్రలోకి జారుకుంది ఆ వెన్నెల్లో తనను అలా చూస్తూ కుర్చుని అలాగే ఉండిపోయా, తన నొసట విరుస్తున్న ముంగురుల పై ఉన్న చెమట బిందువు తామరాకు పై తొలకరి జల్లులాగ నేలరాలుతోంది.. చేపల్లాంటి కాటుక దిద్దిన కళ్ళు అలా తిప్పుతూ రువ్విన చూపులు నా హృదయానికి సంకెళ్ళు వేసి ఎటు కధలనీకుండా మేలిపెడుతున్నాయి … పాల చెక్కిళ్ళు ఆ వెన్నెల దీపాల కొలను లాగ ముగ్ధ మనోహరంగా మెరిసిపోతున్నాయి…. సన్నగా పొడువుగా ఉన్న తన కోనేరు ముక్కుపై ఉన్న ముక్కెర మబ్బుల చాటు ఉన్న నక్షత్రం లాగ తన వైపుకి నన్ను రమ్మంటోంది … ఆ అధరాల మాటున దాగి ఉన్న చిరు మందహాసం ఈ వెన్నెల కాంతులలో హరివిల్లు విరుజిమ్ముతు మంచు కురిపిస్తోంది…. కోటి వీణలు కూడా పలికించలేని తన స్వరం నుంచి వచ్చిన “భరత్” అన్న పిలుపు విన్నప్పుడు తను పిలవడానికి నాకు ఈ పేరు ఉంది అనిపించింది ఆ పిలుపు విన్నాక ఎదలో ఎవో సరికొత్త సరిగమలు …. మెరుపుకి తొలకరి జల్లు కలగలిపినట్టు తన రూపం …. తారలన్ని తమ వెలుగులని ధారపోసినట్టు ఆ సోయగం. ….
అలా చూస్తున్న నన్ను మా ఘోష రాముడు " ఆ డైలాగ్స్ ఏందిరో కొంప తీసి లవ్ కాని చేస్తున్నవ ఏంటి ఆ పిల్లని దేవుడే కాపాడాలి" నేను ఏమి పట్టనట్టు అలానే చూస్తున్న మల్లి వాడు అరుస్తున్నాడు "రే దిష్టి కల్లోడ అదేంట్ర ఆ పిల్లని తినేసేలాగా చూస్తున్నావు చాలు ఆపు ఇంకా చూస్తే నీ దిష్టి తగిలి అమ్మాయి కమిలి పోతుంది అని అరుస్తున్నాడు" వాడి ఘోష శోష అన్ని పాశానం లో తొక్కి అలా చూస్తూ ఉండిపోయాను... ఏంటో మా అభి గాడి పెళ్లి నా పెళ్లికి వచ్చింది అని సంతోష పడిపోతుంటే కొంచం కొంచం గా కళ్ళు మూతలు పడుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com