నిరుద్యోగ ఉపాధ్యాయులకు శుభవార్త.!
- October 21, 2017
తెలంగాణలో ఉపాధ్యాయ నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) ప్రకటన విడుదలైంది. ఈ ప్రకటనను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శనివారం సాయంత్రం విడుదల చేసింది. టీఆర్టీ ద్వారా 8,792 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ మొత్తం ఐదు నోటిఫికేషన్లను విడుదల చేసింది. టీఆర్టీకి మొత్తం నాలుగు లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యే అవకాశాలు ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.
ఫిబ్రవరిలో పరీక్ష తేదీలు ప్రకటన
స్కూల్ అసిస్టెంట్లు 1941, పీఈటీ 416 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్లు (వ్యాయామ విద్య) 9, భాషా పండితులు 1011, ఎస్జీటీ 5,415 పోస్టుల చొప్పున భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు విడుదల చేశారు. ఈ నెల 30 నుంచి నవంబర్ 30 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండో వారంలో పరీక్ష తేదీలను ప్రకటించనున్నట్టు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీ, భాషా పండితుల పోస్టులకు టెట్ 20శాతం వెయిటేజీ కల్పించనున్నారు. తెలంగాణలో 31 జిల్లాల ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..







